ఐపీఎల్‌‌ @ 50 రోజులు

ఐపీఎల్‌‌ @ 50 రోజులు

29న ముంబై, చెన్నై మధ్య ఫస్ట్‌‌ ఫైట్‌‌   

ఏప్రిల్​ 1న ముంబైతో సన్‌‌రైజర్స్‌‌ తొలి పోరు

ముంబై: క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు గుడ్‌‌ న్యూస్‌‌. సమ్మర్‌‌లో ధనాధన్‌‌ ఆటతో అలరించే ఇండియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ హంగామా ఈ సారి మరికొన్ని రోజులు కొనసాగనుంది. మార్చి 29న మొదలయ్యే ఐపీఎల్‌‌ పదమూడో ఎడిషన్‌‌ యాభై రోజుల పాటు జరగనుంది. ఈ మేరకు కొత్త సీజన్‌‌ షెడ్యూల్‌‌ను బీసీసీఐ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటిదాకా వీకెండ్స్‌‌లో (శని, ఆది) రెండేసి మ్యాచ్‌‌లు జరగగా.. ఈ సీజన్‌‌లో ఆదివారం మాత్రమే డబుల్‌‌ హెడర్స్‌‌ను షెడ్యూల్‌‌ చేసింది. దాంతో,  లీగ్‌‌ జరిగే రోజుల సంఖ్య 44 నుంచి 50కి పెరిగింది. ఈ సీజన్‌‌లో ఆరు డబుల్‌‌ హెడర్స్‌‌ జరగనున్నాయి.  వచ్చే నెల 29న  వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌‌లో డిఫెండింగ్‌‌ చాంప్‌‌ ముంబై, గతేడాది రన్నరప్‌‌ చెన్నై తలపడతాయి. ఇక,  ఉప్పల్‌‌ స్టేడియంలో  ఏప్రిల్‌‌1న  ముంబైతో జరిగే మ్యాచ్‌‌తో  సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ కొత్త  ఎడిషన్‌‌ను మొదలుపెట్టనుంది.  కాగా.. కొత్త సీజన్​ ప్లే ఆఫ్స్‌‌ తేదీలు, వేదికలు ఇంకా ప్రకటించలేదు. ఫైనల్‌‌ మాత్రం మే 24న జరగనుంది.