IPL Peter Pan's: ఐపీఎల్ ‘పీటర్ పాన్స్’.. కోహ్లీ- ధోని- రోహిత్ సుదీర్ఘ ప్రయాణం ఇదే

IPL Peter Pan's: ఐపీఎల్ ‘పీటర్ పాన్స్’.. కోహ్లీ- ధోని- రోహిత్ సుదీర్ఘ ప్రయాణం ఇదే

IPL Peter Pan's: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఇప్పుడు 19వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. దాదాపు రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎందరో ఆటగాళ్లు వచ్చి వెళ్లారు. కానీ, కొందరు మాత్రం మొదటి సీజన్ (2008) నుంచి నేటి వరకు ఈ లీగ్ లో తమదైన ముద్ర వేస్తూనే ఉన్నారు. వారిలో ముగ్గురు ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారగా, నాలుగో వ్యక్తి ఒక చారిత్రాత్మక రికార్డుతో హీస్టరీలో నిలిచిపోయాడు. ఈ నలుగురినే ఐపీఎల్ ‘పీటర్ పాన్స్’గా పిలుస్తుంటారు.  

* విరాట్ కోహ్లీ (ఆర్సీబీ)
2008లో అండర్–-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్‌గా కోహ్లీతో ఆర్సీబీ ఒప్పందం చేసుకుంది. ఆరంభంలో 'చీకూ' గా పిలవబడే ఇతడు, కొన్ని సీజన్ల తర్వాత లీగ్ లోనే తిరుగులేని దిగ్గజ క్రికెటర్ గా ఎదిగాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు మైలురాయిని అందుకున్న తొలి ప్లేయర్ గా విరాట్ నిలవనున్నాడు. అలాగే ఒకే ఫ్రాంచైజీ (RCB) తరపున 267 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ రికార్డును భవిష్యత్తులో ఎవరూ కూడా అధిగమించే అవకాశం లేదు. 

* ఎంఎస్ ధోనీ (సీఎస్కే)
44 ఏళ్ల వయసులో తన కెరీర్ చివరి సీజన్ ఆడుతున్నట్లు కనిపిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు (278) ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ రెండేళ్ల నిషేధానికి గురైనప్పుడు, ధోనీ రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ తరపున 30 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 2026 సీజన్‌తో కోహ్లీ తర్వాత ఒకే ఫ్రాంచైజీ (CSK) తరపున 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో ఆటగాడిగా ధోనీ రికార్డు నెలకొల్పనున్నాడు. 

►ALSO READ | PSL 2026 in Crisis: పాక్– ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు.. ఫ్యాన్స్ లేకుండానే పాకిస్తాన్ సూపర్ లీగ్

* రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)
విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ కంటే ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని ముద్దాడింది రోహిత్ శర్మ (2009లో డెక్కన్ ఛార్జర్స్ తరపున).. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు వెళ్లిన తర్వాత, సచిన్ టెండూల్కర్ వారసుడిగా ఆ జట్టుపై తనదైన మార్క్ వేశాడు ఈ ముంబై కి రాజా. ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లను అందించిన కెప్టెన్ రోహిత్. ప్రస్తుతం ఒక సాధారణ ప్లేయర్ గానే జట్టులో కొనసాగుతున్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో ఏడో ఐపీఎల్ టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఈ సీజన్‌లో బరిలోకి దిగబోతున్నాడు. 

* మనీష్ పాండే (చారిత్రాత్మక రికార్డు)
మనీష్ పాండేను కోహ్లీ, ధోనీలతో సమానమైన దిగ్గజంగా పేర్కొనలేకపోయినప్పటికీ, ఐపీఎల్ చరిత్రలో అతడి పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఈ ఐపీఎల్‌లో మొదటి సెంచరీ సాధించిన తొలి భారతీయ బ్యాటర్ మనీష్ పాండే (2009లో డెక్కన్ ఛార్జర్స్‌పై 114 పరుగులు) నిలిచాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సహా ఏడు వేర్వేరు జట్ల తరపున ఆడాడు. 2014లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.