Kohli IPL Records: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 6 రికార్డులు ఇవే!

Kohli IPL Records: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 6 రికార్డులు ఇవే!

Kohli IPL Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్థానాన్ని మరోసారి కొనసాగించడానికి రెడీ అయ్యాడు. 2008లో ప్రారంభమైన తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఆడుతున్న కోహ్లీ, అనేక అరుదైన రికార్డులను తన పేరుపై నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో విరాట్ మాత్రమే సాధించిన 6 అద్భుత ఘనతలు ఏమిటో తెలుసుకుందాం.. 

* 8000+ రన్స్ చేసిన ఏకైక ప్లేయర్: 
విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో 8000+ పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతను 267 మ్యాచ్‌లలో 8,661 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 7046 పరుగులతో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. 

* అత్యధిక సెంచరీలు: 
ఇండియన్ ప్రీమియర్ల లీగ్ లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా కూడా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతను మొత్తం 8 సెంచరీలు సాధించగా, జోస్ బట్లర్ 7 సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 

* ఒకే జట్టుకు 19 సీజన్లు: 
2008 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ కేవలం ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026తో అతను వరుసగా 19 సీజన్లు ఒకే జట్టుకు ఆడిన ఏకైక ప్లేయర్‌గా నిలుస్తాడు. కింగ్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఆక్షన్‌లోకి వెళ్లలేదు.  

* 70కి పైగా హాఫ్ సెంచరీలు: 
విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 70కి పైగా 50+ స్కోర్లు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. అతను మొత్తం 71 సార్లు 50కి పైగా రన్స్ చేశాడు (63 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు) ఉన్నాయి.

►ALSO READ | IPL Peter Pan's: ఐపీఎల్ ‘పీటర్ పాన్స్’.. కోహ్లీ- ధోని- రోహిత్ సుదీర్ఘ ప్రయాణం ఇదే 

* ఒక సీజన్‌లో 900+ రన్స్: 
2016 సీజన్‌లో కింగ్ కోహ్లీ 972 పరుగులు చేసి, ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు మరెవరూ కూడా 900+ పరుగుల మార్క్‌ను దగ్గరకి కూడా రాలేకపోయారు.  

* 4 టీమ్స్ 1000+ పరుగులు: 
విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో నాలుగు జట్లపై 1000కి పైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్‌పై ఈ రికార్డు సాధించాడు.