రైజర్స్ హ్యాట్రిక్..ఢిల్లీపై గ్రేట్ విక్టరీ

రైజర్స్ హ్యాట్రిక్..ఢిల్లీపై గ్రేట్ విక్టరీ

ఢిల్లీ : సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబా ద్‌ ఫుల్‌ రైజింగ్‌ లో ఉంది . గత రెండు మ్యా చ్‌ ల్లో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌ చేసి 200 పైచిలుకు పరుగులు చేసిన రైజర్స్‌‌‌‌‌‌‌‌ గురువారం ఢిల్లీ క్యాపి టల్స్‌‌‌‌‌‌‌‌తో మ్యా చ్‌ లో ఈజీ టార్గె ట్‌ ను అంతే ఈజీగా ఛేజ్‌ చేసి హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ విక్టరీ నమోదు చేసింది. మొదట బౌలర్లు విజృంభించి ప్రత్యర్థిని తక్కువ పరుగులకే పరిమితం చేస్తే.. గత మ్యాచ్‌ లో భారీ సెంచరీతో బెం గళూరు బౌలర్లను చీల్చి చెండాడిన రైజర్స్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో(28 బంతుల్లో 9 ఫోర్లు సిక్సర్‌ తో 48) ఈ మ్యాచ్‌ లోనూ రెచ్చిపోవడంతో 5 వికెట్ల తేడాతో రైజర్స్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపి టల్స్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో

8 వికెట్ల కు 129 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌ (41 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌ తో 43) ఫర్వాలేదనిపిస్తే.. ఆఖర్లో ఆల్‌ రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (13 బంతుల్లో ఫోర్‌ , 2 సిక్సర్లతో 23 నాటౌట్‌ ) విలువైన పరుగులు చేశాడు. హైదరాబా ద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ , మహ్మద్‌ నబీ, సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌ కౌల్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌ లో రైజర్స్‌‌‌‌‌‌‌‌ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. బెయిర్‌ స్టో కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ’అవార్డు దక్కింది.

బెయి ర్‌ స్టో .. అదే షో

సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ టార్గె ట్‌ 130.. సొంతగడ్డపై భారీ స్కోర్లు చేసి ఫుల్‌ జోష్‌ లో ఉన్న సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌కు ఇదో లెక్కా ..దానికి తగ్గట్టే బెయిర్‌ స్టో ఆరంభం నుంచే రెచ్చిపోయాడు. వార్నర్‌ (10)ను ప్రేక్షక పాత్రకు పరిమితం చేస్తూ..ఎడాపెడా బౌండ్రీలతో  రుచుకుపడ్డాడు. లామిచానె వేసిన మూడో ఓవర్‌ లో 6,4 కొట్టిన బెయిర్‌ స్టో .. ఆ తర్వాత మోరిస్‌‌‌‌‌‌‌‌, రబాడ ఓవర్లలో మూడేసి ఫోర్లు బాదాడు. అతడి జోరుతో రైజర్స్‌‌‌‌‌‌‌‌ పవర్‌ ప్లే పూర్తయ్యేసరికి వికెట్‌ నష్టపోకుండా 68 రన్స్‌‌‌‌‌‌‌‌ చేసింది. అందులో బెయిర్‌ స్టో 47 చేస్తే.. విధ్వంసా నికి మారుపేరైన వార్నర్‌ 6 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకు ఈ సీ జన్‌ లో ఆడిన 3 మ్యా చ్‌ ల్లోనూ తొలి వికెట్‌ కు సెంచరీ భాగస్వామ్యా లతో అదరగొట్టిన వీరిద్దరే మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ ను ముగించేలా కనిపించారు.అయితే బెయిర్‌ స్టో ను వికెట్లముందు దొరక బుచ్చుకున్న తెవాటియా రైజర్స్‌‌‌‌‌‌‌‌ జోరుకు కళ్లెం వేశాడు.

ఆ మరుసటి ఓవర్‌ లో వార్నర్‌ కూడా ఔటయ్యాడు. 18 బంతు లాడిన వార్నర్‌ ఒక్క బౌండ్రీ కూడా కొట్టకుండా 10 పరుగులే చేశాడు. దీంతో రైజర్స్‌‌‌‌‌‌‌‌ కొంత తడబడినా .. ఛేదించాల్సి న టార్గెట్‌ ఎక్కువ లేకపోవడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుకు సాగింది. విజయ్‌ శంకర్‌ (16), మనీశ్‌ పాం డే (10), దీపక్‌‌‌‌‌‌‌‌ హుడా (10), యూసుఫ్‌ పఠాన్‌ (9 నా టౌట్‌ ) తలా కొన్ని పరుగులు చేశారు. విజయానికి 11 బంతుల్లో 9 రన్స్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన దశలో నబీ (9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ తో 17 నాటౌట్‌ ) వరుస బంతుల్లో 4,6తో రైజర్స్‌‌‌‌‌‌‌‌కు విజయాన్ని కట్టబెట్టాడు.

రైజర్స్‌ బౌలర్స్‌ రైజింగ్‌

అంతకుముందు టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాట ింగ్‌ కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ తొలి ఓవర్‌ లో 2 ఫోర్లు కొట్టిన యంగ్‌ గన్‌ పృథ్వీ షా (11) మరుసటి ఓవర్‌ లో భువీకే చిక్కాడు. గుడ్‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బంతిని క్రాస్‌‌‌‌‌‌‌‌ లైన్‌ ఆడేందుకు యత్నించిన షా క్లీన్‌ బౌల్డయ్యాడు. ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ మరో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (12) నబీ బౌలింగ్‌ లో స్వీప్‌ షాట్‌ కొట్టి షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫైన్‌ లెగ్‌ లో సందీప్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి ఢిల్లీ 36/2తో నిలిచింది. కెప్టె న్‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌ , పంత్‌ (5) క్రీజులో ఉన్నా.. భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. ఓ వైపు నబీ కట్టుది ట్టమైన బంతులతో కట్టిపడేస్తుంటే.. గత రెండు మ్యాచ్‌ ల్లో పెద్దగా ప్రభావం చూపని మిగతా బౌలర్లు కూడా లయ దొరకబుచ్చుకున్నారు.

ఇటీవలి కాలంలో ‘ఇండియన్‌ ఏబీ డిలియర్స్‌‌‌‌‌‌‌‌’గా రెచ్చిపోతున్న పంత్‌ ఒక్క బౌండ్రీ కొట్టకుండానే నబీ బౌలింగ్‌ లో ఔటయ్యాడు. కాసేపటికే తెవాటియా (5) కూడా అతన్ని అనుసరించాడు. దీంతో 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 61/4తో కష్టాల్లో పడింది. బౌలింగ్‌ చేసిన ప్రతీ రైజర్‌ బౌలర్‌ వికెట్‌ దక్కించుకున్నాడు. కౌల్‌ బంతిని పాయింట్‌ మీదుగా కొట్టేందుకు యత్నించిన ఇంగ్రామ్‌‌‌‌‌‌‌‌ (5) పాండే పట్టిన చక్కటి క్యాచ్‌ కు పెవిలియన్‌ బాట పడితే.. అడపా దడపా బౌండ్రీలు కొడుతూ వచ్చిన అయ్యర్‌ ను రషీద్‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆ తర్వాత ఓ సిక్సర్‌ కొట్టిన మోరిస్‌‌‌‌‌‌‌‌ (15బంతుల్లో ఫోర్‌ , సిక్సర్‌ తో 17) భువీ బౌలింగ్‌ లో వెనుదిరిగితే.. రబాడ (3)ను కౌల్‌ ఔట్‌ చేశాడు. అయితే ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ చివరి మూడు బంతు లకు అక్షర్‌ 6,2,6బాదడంతో ఢిల్లీ ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ చివరి ఓవర్‌ లో వచ్చిన 14 పరుగులే అత్యధికం అంటే రైజర్స్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌ ఎలా సాగిందో చెప్పొచ్చు.