సీజ్ ఫైర్ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్ పై అమెరికా డెడ్ లైన్ విధించడంతో గల్ఫ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. హార్మూజ్ జలసంధి తెరిచేకందుకు నిరాకరించడంపై ట్రంప్ తోకతొక్కిన తాచులా తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ను తుడిచిపెట్టేస్తామని 2026 ఏప్రిల్ 06న ప్రకటించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ట్రంప్ హెచ్చరికలతో ఇరాన్ పవర్ ప్లాంట్స్ చుట్టూ మానవ హారాలు నిర్మించాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. పవర్ ప్లాంట్స్ చుట్టూ యువత, కళాకారులు, మేధావులు, పౌరులు ఏప్రిల్ 7న మానవహారాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది.
ఇరాన్ యూత్, స్పోర్ట్స్ డిప్యూటీ మినిస్టర్ అలీరెజా రహీమీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇరాన్ పౌరులు తమ జాతీయ ఆస్తులను కాపాడుకునేందుకు చేయి చేయి కలపాలని పిలపునిచ్చారు. చేయి చేయి కలిపి భవిష్యత్తు కోసం నిలబడాలని కోరారు.
- ట్రంప్ హెచ్చరికలు:
హార్మూజ్ జలసంధికి ఒప్పుకోకపోవడం, పాక్ మధ్యవర్తిత్వంతో సీజ్ ఫైర్ ప్రతిపాదనను తిరస్కరించడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్ ను తుడిచిపెట్టేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పవర్ ప్లాట్స్, బ్రిడ్జీలే లక్ష్యంగా దాడులు చేస్తామని చెప్పారు. జలసంధి ఓపెన్ చేసేందుకు తీవ్ర దాడులు చేస్తామని అన్నారు. ఇరాన్ పై అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడిన ట్రంప్.. ఏప్రిల్ 7న ఇరాన్ కు చుక్కలు చూపిస్తామని హెచ్చరిండంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
