12 ఏండ్ల పిల్లలు యుద్ధ విధుల్లోకి..రూల్స్ మార్చేసిన ఇరాన్

12 ఏండ్ల పిల్లలు యుద్ధ విధుల్లోకి..రూల్స్ మార్చేసిన ఇరాన్

టెహ్రాన్: అంతర్జాతీయ నిబంధనలను ధిక్కరిస్తూ ఇరాన్ తమ దేశపు రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్  జీసీ) లోకి చిన్నారులను చేర్చుకునేందుకు సిద్ధమైంది. యుద్ధ సంబంధిత సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కనీస వయస్సును 12 ఏళ్లకు తగ్గిస్తూ ఇరాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 

‘ఫర్ ఇరాన్’ అనే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నియామకాలు జరుగుతాయని ఐఆర్​జీసీ అధికారి రహీమ్ నదాలీ వెల్లడించారు. 12 నుంచి 13 ఏళ్ల వయస్సు గల బాలలు ఇకపై పెట్రోలింగ్, చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్టుల నిర్వహణ మరియు లాజిస్టిక్స్ వంటి కీలక విధుల్లో పాల్గొనవచ్చు. దేశం కోసం సేవ చేయాలనే ఉత్సాహం చిన్నారుల్లో పెరుగుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. 

అయితే, ఐక్యరాజ్యసమితికి చెందిన ‘పిల్లల హక్కుల ఒప్పందం’ ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలను సైనిక కార్యకలాపాల్లో ఉపయోగించడం నిషేధం. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.