ఇరాన్ ఫుట్‌బాల్ జట్టుకు వీసా కష్టాలు.. మెక్సికో బోర్డర్ సిటీకి ప్లేయర్స్.. అమెరికాకు వెళ్లకుండా అక్కడే బస!

ఇరాన్ ఫుట్‌బాల్ జట్టుకు వీసా కష్టాలు.. మెక్సికో బోర్డర్ సిటీకి ప్లేయర్స్.. అమెరికాకు వెళ్లకుండా అక్కడే బస!

FIFA World Cup 2026: ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ (FIFA World Cup 2026) ఆడేందుకు అమెరికా వెళ్లాల్సిన ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు.. రాజకీయ ఉద్రిక్తతలు, వీసా కష్టాల వల్ల మెక్సికో సరిహద్దు నగరమైన టిజువానా (Tijuana) కు చేరుకుంది. అమెరికా వీసాలు రావడంలో విపరీతమైన ఆలస్యం, అనిశ్చితి నెలకొనడంతో ఇరాన్ టీమ్ తన ప్లాన్ మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్: 
టర్కీలో మూడు వారాల పాటు సుదీర్ఘమైన ట్రైనింగ్ క్యాంప్ ముగించుకున్న ఇరాన్ జట్టు.. అక్కడి నుంచి ఓవర్‌నైట్ ఫ్లైట్‌లో బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మెక్సికోలోని టిజువానాలో ల్యాండ్ అయింది. ఎయిర్‌పోర్టులో ఇరాన్ జెండాలతో రెడీగా ఉన్న కొద్దిమంది అభిమానులు జట్టుకు ఘనస్వాగతం పలకగా.. సెక్యూరిటీ సిబ్బంది ప్లేయర్లను గట్టి భద్రత మధ్య హోటల్‌కు తరలించారు.  

మెక్సికో బోర్డర్‌కు ఇరాన్ జట్టు: 
నిజానికి ఇరాన్ టీమ్ వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ కోసం అమెరికాలోని అరిజోనా (Arizona) లో బస చేయాలని ప్లాన్ చేసుకుంది. కానీ, అమెరికాలోకి ఎంట్రీ పర్మిషన్లు, వీసాలు వస్తాయో రావో అనే టెన్షన్ వారాల తరబడి కొనసాగడంతో.. రిస్క్ తీసుకోకుండా మెక్సికో బోర్డర్ సిటీ టిజువానాను తమ బేస్‌గా మార్చుకున్నారు. ఇరాన్ ప్లేయర్ల ట్రావెల్ డాక్యుమెంట్లను యూఎస్ అధికారులు అప్రూవ్ చేసినప్పటికీ, టీమ్‌కు సపోర్ట్ చేసే లార్జర్ డెలిగేషన్, సపోర్ట్ స్టాఫ్‌లో చాలా మందికి వీసాలు లభించలేదు.. దీంతో సగం స్టాఫ్ లేకుండానే టీమ్ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.  

అమెరికా సర్కార్ పై కోచ్ ఫైర్: 
ఈ వీసా లొల్లి, ఎదుర్కొన్న సవాళ్లపై ఇరాన్ హెడ్ కోచ్ అమీర్ ఘాలెనోయ్ మాట్లాడుతూ.. సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్లు జరిగేటప్పుడు టెక్నికల్ విషయాల కంటే మానవత్వానికి, నైతిక విలువలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి.. కానీ, మా విషయంలో ఆ కనీస మర్యాద, మానవత్వం చూపించలేదన్నాడు. మరోవైపు డిఫెండర్ ఎహ్సాన్ హాజ్‌సఫీ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా పరిస్థితులు చాలా టెన్షన్‌గా ఉన్నప్పటికీ, తమ టీమ్ మాత్రం ఫిజికల్‌గా టోర్నమెంట్‌కు ఫుల్ రెడీగా ఉందని స్పష్టం చేశాడు.

ఇరాన్ మ్యాచ్‌ల షెడ్యూల్:
* జూన్ 15: లాస్ ఏంజిల్స్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫస్ట్ మ్యాచ్.
* జూన్ 21: బెల్జియం జట్టుతో సెకండ్ ఫైట్.
* జూన్ 26: సీటెల్‌లో ఈజిప్ట్‌తో లాస్ట్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్.