ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి

ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి

ఇజ్రాయెల్పై ఇరాన్ ఆదివారం (ఏప్రిల్ 14) దాడి చేసింది. వందలాది డ్రోన్లు,క్షిపణులతో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ అంతటా బూమ్ లు, వైమానిక దాడి సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దశాబ్దాల శతృత్వం ఉన్నప్పటికీ ఇరాన్..ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష సైనిక దాడి చేయడం ఇదే మొదటి సారి. ఇరాన్ డ్రోన్లు, క్యూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణు లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ మిలిటరీ ధృవీకరించింది. దక్షిణ ఇజ్రాయెల్ లోని బెడౌన్ అరబ్ పట్టణంలో క్షిపణీ దాడిలో పదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడిందని వెల్లడించారు.మరో క్షిపణి ఆర్మీ బేస్ ను  ప్రయోగించారని..స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఎవరికి గాయాలు కాలేదని ప్రకటించింది. ఇరాన్ దాడులను చాలావరకు సమర్థవంతంగా తిప్పికొట్టామని ప్రకటించారు. 

ఇజ్రాయెల్, ఇరాన్ గాజా స్ట్రిప్ లో హమాస్ మిలిటెంట్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఆరు నెలలుగా యుద్ధం చేస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న రెండు మిలిటెంట్ గ్రూపులు హమాస్, ఇస్లామిక్ జిహాద్ .. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లోన 1200 మందిని చంపి, 250 మందిని కిడ్నాప్ చేశారు. ఈ విధ్వంసకర సరిహద్దు దాడి తర్వాత యుద్దం చెలరేగింది. గాజాలో ఇజ్రాయెల్ దాడి భారీ ఎత్తున విధ్వంసం సృష్టించింది. స్థానిక ఆరోగ్య అధికారులు రిపోర్టు ప్రకారం.. 33 వేల మంది కి పైగతా ప్రజలు మరణించారు. 
ఈ యుద్దంలో లెబనాన్ లోని ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుపై దాడి చేశారు.ఇరాక్, సిరియా , యెమెన్ లోని ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు సైతం ఇజ్రాయెల్ పై రాకెట్లు, క్షిపణులను ప్రయోగించాయి. ఇలారు రోజుల తరబడి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 
ఉత్తర ఇజ్రాయెల్, దక్షిణ ఇజ్రాయెల్, ఉత్తర వెస్ట్ బ్యాంక్, జోర్డాన్ సరిహద్దుసమీపంలో డెడ్ సీతో సహా అనేక ప్రదేశాల్లో ఇరాన్  డ్రోన్లు, క్షిపణులతో వైమానిక దాడులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సిరియన్, లెబనీస్ సరిహద్దులకు సమీపంలో, దక్షిణ పట్టణాలైన నెవాటిమ్, డిమోనా, ఎర్ర సముద్రం రిసార్ట్ అయిన ఐలాట్ లలో స్థానికులను రక్షిత ప్రదేశాలకు తరలించింది. డిమోనా ఇజ్రాయెట్ ప్రధాన అణు కేంద్రానికి నిలయంగా ఉంది.. నెవాటిమ్ లో ప్రధాన వైమానిక స్థావరం ఉంది.

మరోవైపు ఇజ్రాయెల్, యూఎస్ కు ఇరాన్ మిషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ మరొక తప్పు చేస్తే ఇరాన్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ముఖ్యంగా అమెరికాకు దూరంగా ఉండాలి అని తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది.