టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇరాన్‌పై దాడులకు అమెరికా సిద్ధమైందని.. ఏ క్షణమైనా ఎటాక్ చేయొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబారి రెజా అమిరి మొఘడం సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం కోరుకోవడం లేదని.. ఇరాన్‌పై దాడి చేసే ఉద్దేశం ఆయనకు లేదన్నారు. ఈ మేరకు బుధవారం (జనవరి 14) తనకు సమాచారం అందిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో సంయమనం పాటించాలని.. మధ్య ప్రాచ్యంలోని అమెరికా బేస్‌లు, సైనిక స్థావరాలపై దాడులు చేయొద్దని ట్రంప్ ఇరాన్‌ను కోరారని అన్నారు.
Also Read : ఉత్కంఠగా సాగుతోన్న మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
ఇరాన్‌లోని ప్రజలకు నిరసన తెలిపే చట్టబద్ధమైన హక్కు ఉందన్నారు. ప్రభుత్వం నిరసనకారులతో చర్చలు జరిపిందని తెలిపారు. హత్యలు, మసీదులపై దాడులు సహా ఇరాన్‌లో జరిగిన హింసాత్మక చర్యల్లో ఉగ్రవాదుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం రాజుకుంటుందన్న వేళ రెజా అమిరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
