ఉత్కంఠగా సాగుతోన్న మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ముంబైలో బీజేపీ, శివసేన మధ్య హోరాహోరీ

ఉత్కంఠగా సాగుతోన్న మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ముంబైలో బీజేపీ, శివసేన మధ్య హోరాహోరీ

ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. శుక్రవారం (జనవరి 16) ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 23 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఎర్లీ ట్రెండ్స్‎లో ఎన్డీఏ నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి అధిక్యంలో దూసుకుపోతుంది. 

దేశ ఆర్థిక రాజధాని ముంబయి సివిక్ బాడీ బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‎లో బీజేపీ, శివసేన (యూబీటీ) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ముంబై కార్పొరేషన్‎లోని మొత్తం 227 వార్డులలో ఇప్పటి వరకు వెలువడ్డ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 31, శివసేన యూబీటీ 25, శివసేన షిండే 10, మహారాష్ట్ర నవనిర్మాణ్ సమితి (ఎంఎన్ఎస్), కాంగ్రెస్ మూడు చోట్ల లీడ్‎లో కొనసాగుతున్నాయి. 

బీఎంసీ పీఠం కైవసం చేసుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 114 స్థానాలు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార మహాయుతి కూటమి అధిక్యంలో ఉంది. థాక్రే బ్రదర్స్ కలయిక ముంబైలో కాస్త ప్రభావం చూపిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. కాగా, మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు 2026, జనవరి 15న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.15,931 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.