ఛీ..ఛీ..రైలు వంటగదిలో ఎలుకలు.. IRCTC రియాక్షన్ ఇదే..

ఛీ..ఛీ..రైలు వంటగదిలో ఎలుకలు.. IRCTC రియాక్షన్ ఇదే..

మీరు ట్రైన్లలో జర్నీ చేస్తున్నారా..? అయితే..ఫుడ్​ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మేము హెచ్చరించడం లేదు. భయపెట్టడం కూడా లేదు.. జస్ట్ సూచన మాత్రమే. కేర్​ లేస్ గా ఉన్నారో అంతే సంగతి. ఎలుకలు సంచరించిన ఫుడ్​ను మీరు తెలియకుండానే ఎంతో ఇష్టంగా.. మరెంతో హాయిగా తిన్నారంటే మిమ్ముల్ని ఎవరూ కాపాడలేరు.. 

రైళ్లలో పంపిణీ చేసే ఆహార పదార్థాల నాణ్యతపై అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తుండడం చూస్తునే ఉంటాం. వింటూనే ఉంటాం. తాజాగా ఓ రైలు వంటగదిలో కనిపించిన  సీన్స్ ప్రయాణికుల్లో, ఫుడ్ లవర్స్​ లో ఆందోళన కలిగిస్తోంది. రైలు కిచెన్‌లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ వైరల్​ గా మారింది.

టెండూల్కర్ అనే వ్యక్తి ఈ మధ్య తన ఫ్యామిలీ మెంబర్స్​ తో కలిసి మడగావ్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్​ లో ప్రయాణించాడు. రైలు కిచెన్‌ (ప్యాంట్రీ) వైపుగా ఎలుకలు వెళ్లడాన్ని అతడు గమనించాడు. అక్కడున్న వంట గిన్నెలపై రెండు ఎలుకలు అటు ఇటు తిరుగుతుండడం చూశాడు. అంతేకాదు.. వండిన ఫుడ్​ ఐటమ్స్​ ను ఎలుకలు రుచి చూస్తుండడాన్ని చూశాడు. వెంటనే తన ఫోన్​ కు పని చెప్పాడు. రైలులోని వంట గదిలో ఎలుకలు సంచరిస్తున్న విజువల్స్​ ను తన ఫోన్​ లో రికార్డు చేశాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఇంకేముంది.. ఆ వీడియో వైరల్ గా మారింది.

Also Read :- రూ.1కే శానిటరీ నాప్‌కిన్‌

ఈ ఘటనపై ఆర్ఫీఎఫ్​ పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు టెండూల్కర్. వంటగదిలో ఎలుకల సంచారంపై ఐఆర్‌సీటీసీ (IRCTC) స్పందించింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బందికి అవగాహన కల్పించామని వివరించారు. మళ్లీ ఇటువంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.