అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్

ఇండియన్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. 2003ల ో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన  ఇర్ఫాన్  2012లో చివరి సారిగా భారత తరపున ఆడాడు.  29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడి మొత్తం 301 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. 

29 టెస్టుల్లో  1105 పరుగులు చేశాడు..ఇందులో ఒక సెంచరీ ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 120 వన్డేలలో 1544 పరుగులు చేశాడు..ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీ20ల్లో 24 టీ20ల్లో 172 పరుగులు చేశాడు. 2006లో పాక్ గడ్డపై టెస్టులో తొలి ఓవర్లో హ్యాట్రిక్ తీసి రికార్డ్ సృష్టించాడు. అలాగే 2007 టీ20 ఫైనల్ మ్యాచ్ లో  16 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. ఇర్ఫాన్ ,యూసుఫ్ పఠాన్ సోదరుడు.