హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో టెండర్ల నిర్వహణలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా గడువు పొడిగిస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన ‘ధర్మవాణి’ కార్యక్రమంలో కమిషనర్ హనుమంతరావుకు ఫిర్యాదు చేశారు.
మొక్కు వస్త్రాల టెండర్ గడువు గతేడాది ఆగస్టులోనే ముగిసినా.. కొత్తగా టెండర్లు పిలవకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే సిఫార్సు మేరకు అప్పటి ఈవో వెంకటరావు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి కనీస ధర నిర్ణయించకుండానే మొక్కు వస్త్రాల టెండర్లకు ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు.

