ఇంటి ముందు ‘ప్లాస్టిక్​ గడ్డి’ లాన్ మంచిదేనా?.. పిల్లలకు ప్రాబ్లమ్ లేదా?

ఇంటి ముందు ‘ప్లాస్టిక్​ గడ్డి’ లాన్ మంచిదేనా?.. పిల్లలకు ప్రాబ్లమ్ లేదా?

ఆర్టిఫీషియల్ లాన్… ఇప్పుడు బాగానే పాపులర్ అవుతున్న పదం. ఒకప్పుడు ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో మెత్తగా పట్టుకుచ్చులా ఉండే గడ్డిని పెంచేవాళ్ళు. దీనివల్ల ఇల్లు అందంగా కనిపించటమే కాదు, వర్షాకాలంలో గ్రౌండ్ వాటర్‌‌‌‌ స్టోరేజ్‌‌ లాగా కూడా పనికి వచ్చేది. అయితే ఇప్పుడున్న ఈ బిజీ
లైఫ్ లో లాన్ మెయింటెయిన్ చెయ్యటం అంత ఈజీ కాదు మరి!  అందుకే ఇప్పుడు అందరి చూపూ ఆర్టిఫిషియల్ లాన్స్ మీదికి మళ్ళింది. ఇంటికి లావిష్ లుక్ తో పాటు, ఒక్కరోజులో ఇంటిచుట్టూ పచ్చని గడ్డి లాన్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు.  అయితే ఇప్పుడిప్పుడే మనదగ్గర మొదలవుతున్న ఈ కృత్రిమ లాన్ మీద ఇంకా కొన్ని అపోహలున్నాయి.

ఆర్టిఫీషియల్ లాన్.. ప్లాస్టిక్ నుంచి తయారయ్యింది అనగానే మనకు వచ్చే మొదటి అనుమానం ‘ఇది ప్రకృతికి చెడు చేసేదే కదా’ అని. అయితే అలాంటి భయం అవసరంలేదు. ఎందుకంటే దీనికోసం ఎక్కువగా రీసైకిల్డ్ ప్లాస్టిక్‌‌నే ఉపయోగిస్తున్నారు.  అంటే భూమిమీద వ్యర్థంగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ నుంచే దీన్ని తయారుచేస్తారు.  కాబట్టి కొత్తగా దీనివల్ల ఏదో చెడు జరుగుతుందన్న అనుమానం అవసరం లేదు. అంతే కాదు, పెట్రోల్‌‌తో నడిచే ‘లాన్ మూవర్స్’ వాడే పని లేదు. ఎక్కువ మొత్తంలో  నీళ్లని వాడే అవసరమూ ఉండదు. గ్రౌండ్ వాటర్ వేస్ట్ అవటాన్ని తగ్గించవచ్చు. ఇక నీళ్లు ఇంకే స్థితి లేదుకదా అని చింతించాల్సిన అవసరం కూడా లేదు ఈ ప్లాస్టిక్ గడ్డిమీదనుంచి పారే వర్షపు నీళ్లని ఇంకుడు గుంతల్లోకి మళ్ళించవచ్చు. అంతే కాదు ఎండాకాలంలో నిజమైన పచ్చికని ఎక్కువ నీటితో తడపాల్సి ఉంటుంది. నీళ్ళు సరిగా అందకపోతే పచ్చిక రంగుమారి అందమంతా పోతుంది. కానీ ఈ కృత్రిమ గడ్డితో అలాంటి ఇబ్బందులు ఉండవు. సంవత్సరమంతా పచ్చగా కనిపిస్తూనే పర్యావరణానికి హాని చెయ్యకుండా ఉంటుంది.

మెయింటెనెన్స్ కష్టమేం కాదు

తరచూ వర్షం పడే ప్రదేశాల్లో అయితే అసలు మెయింటెనెన్స్ అనే మాటే ఉండదు. ఐస్క్రీం, కూల్‌‌డ్రింక్స్ మరకలు పడ్డప్పుడు మాత్రం కొద్దిపాటి నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు. ఇక నీడలో ఉన్న ప్రదేశంలో ఈ ఆర్టిఫీషియల్ గ్రాస్ ఉంటే నాచుపట్టే అవకాశం ఉంది, కాలుజారి పడకుండా ఉండటానికి  పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేదా గడ్డి మధ్యలో గులకరాళ్ళు, కాస్త రఫ్‌‌గా ఉండే టైల్స్ వేసుకున్నా సరిపోతుంది. మొత్తంగా ఇది మరీ కష్టమైన పని మాత్రం కాదు. సో..! మెయింటెనెన్స్ గురించి భయపడాల్సిన పని లేదు.

ఆటలాడొచ్చు

నిజానికి పిల్లలకు గడ్డిమీద ఆడుకోవటం ఇష్టం. మెత్తని గడ్డిలో దెబ్బలు తగలకుండా ఆడుకోవటానికి ఈ ఆర్టిఫీషియల్ లాన్ పనికి రాదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది కూడా ఒక ఉత్తి అనుమానమే. పిల్లలు ఆడుకోవటానికి అనువైన మెత్తని లాన్ కూడా ఈ ఆర్టిఫిషియల్ గడ్డితో ఏర్పాటు చేసుకోవచ్చు. స్విమ్మింగ్‌‌పూల్ దగ్గర, మెట్లు ఉండే ప్లేస్‌‌లోనూ చుట్టూ దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
నిజమైన గడ్డి ఉన్నంత మెత్తగా సాఫ్ట్ గా ఉండే కృత్రిమ లాన్ ఏర్పాటు పెద్ద కష్టమేమీ కాదు. క్రికెట్, బాట్మింటన్ లాంటి ఆటలే కాదు హాయిగా కబడ్డీ లాంటి ఆటలకు కూడా ఈ ఆర్టిఫిషియల్ లాన్ అనుకూలమే. ఇంటిలోపల అక్వేరియం, ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకున్న చోటా, బాల్కనీలో మరింత అందాన్ని పెంచుకోవటానికి ఇది సౌకర్యంగానే ఉంటుంది.

ఎండాకాలంలో ఇబ్బందే!?

ప్లాస్టిక్ ఎండకి వేడెక్కుతుందన్న విషయం నిజమే. కానీ… అంతే త్వరగా చల్లబడుతుందన్నది కూడా గమనించాలి. కొద్ది నిమిషాలలోనే చల్లబడుతుంది. ఇక వేడెక్కినప్పుడు కూడా మరీ, సిమెంట్, గ్రానైట్ లాగా కాళ్ళు కాలిపోయేంత వేడి మాత్రం ఉండదు. అయితే ఇప్పుడు ఫైర్ ఫ్రూఫ్, హీట్‌‌రెసిస్టెంట్ గ్రాస్‌‌ని తయారుచేసే పనిలో ఉన్నారు సైంటిస్టులు. వీలు ఉన్న చోట అయితే ఎండ ఉన్న టైంలో స్ప్రింక్లర్లతో నీళ్లని ఈ గ్రాస్ మీద చిమ్ముతూఉంటే ఆ తేమకి వెడెక్కకుండా ఉంటుంది. ఇది  ఎండాకాలంలో  బురదలేకుండా పిల్లలు ఆడుకోవటానికి మంచి ప్లేగ్రౌండ్ కూడా అవుతుంది.

సహజంగా కనిపించేలా

కృత్రిమ గడ్డి నిజమైన లాన్‌‌లా కనిపించదు అనే అనుమానం చాలామందిలో ఉంది. కానీ అదంతా ఇలాంటి ట్రెండ్ మొదలైన కొత్తల్లో ఉండేది. ఇప్పుడు చాలా సహజంగా కనిపించే మోడల్స్ వచ్చాయి. ఎంచుకునేటప్పుడు మన లాన్ ఎంత స్థలంలో ఉందో చూసుకొని ఎక్కువ చిన్నచిన్న ముక్కలు లేకుండా ఉంటే చాలు.  మరింత సహజంగా కనిపించటానికి వేరు వేరు షేడ్స్ లోఉన్న గ్రాస్‌‌ని తీసుకోవాలి. గ్రాస్‌‌షీట్స్ చివరలు బయటికి కనిపించకుండా పరుచుకోవాలి.

More News:

పిల్లల మిస్సింగ్​ కేసులను ఎట్ల మూస్తరు?

ఇంత ఘోరమైన చావా? చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది..

డ్రైవింగ్ కి అనుకూలమేనా

కొన్ని రకాల గ్రాస్ వాహనాలని నిలపటానికి, దానిమీద కార్లని నడపటానికి పనికిరాదు. కార్ నడిపే స్థలంలో స్పెషల్ గ్రాస్ వాడాల్సి ఉంటుంది. టర్నింగ్ చేయాల్సిన ప్రదేశంలో మామూలు లాన్ కోసం వాడే గ్రాస్ పనికి రాదు. టైర్లవల్ల తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. మధ్యలో చిరుగులతో చూడటానికి బావుండదు. అందుకే వాహనాలని నిలిపే ప్రదేశాలకోసం వేరే రకాల గ్రాస్ షీట్స్‌‌ని సెలక్ట్ చేసుకోవాలి.

పెంపుడు జంతువులకు అనుకూలమా
ఇది కాస్త ఇబ్బందే…! కుక్కలు హాయిగా పరుగుతీయటానికి మంచి సర్ఫేస్ ఉంటుంది. హాయిగా మీ పెట్స్‌‌ని ఇందులో ఆడుకోనివ్వచ్చు. మూత్ర విసర్జనకోసం కుక్కలని మట్టిలోకి తీసుకుపోవటం మంచిది. లేదంటే ఈజీగా శుభ్రం చేయటానికి
డిటర్జెంట్, షుగర్ సోప్స్ అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఎక్కువగా క్రిములు, హానికారక బ్యాక్టీరియా పేరుకుపోకుండా చూడవచ్చు. ఇక రాలిన ఆకులూ, పక్షుల రెట్టలని కూడా ఎక్కువకాలం నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కుళ్ళిపోతే మట్టిలో కలిసి పోయే అవకాశం లేకపోవటం వల్ల లాన్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.