అతి పెద్ద ఆర్థిక సంక్షోభం దిశగా భారత్ ? ఔను నిజమేననిపిస్తోంది. మన రూపాయి ముద్రణ అనేది బంగారం, ఫారెక్స్ నిల్వల ఆధారంగా సాగుతుంది.. మన దేశంలో ఇటీవల జరిగిన పరిణామాలు.. పశ్చిమాసియా యుద్ధం కారణంగా విదేశీ ప్రయాణాలు పెరిగిన నేపథ్యంలో దేశంలో ఉన్న విదేశీ మారక నిల్వలు గణనీయంగా పడిపోయాయి. దీని ప్రభావం మన రూపాయిపై పడింది.. ఒకప్పుడు డాలర్ తో రూ. 40 ఉన్న మారక విలువ కాస్తా రూ. 95కు చేరింది. ఈ తరుణంలో మనం దిగుమతులపై ఆధార పడితే.. మన దగ్గర ఉన్న ఫారెక్స్ నిల్వలు నేలమట్టమవుతాయి. అప్పుడు రూపాయి ఛిన్నా భిన్నం అవుతుంది.
సంక్షోభం చివరి అంచుల దాకా చేరినందున ఇప్పుడున్న ఏకైక మార్గం పొదుపు మంత్రం.. డీజిల్, పెట్రోల్, గ్యాస్ కొనొద్దు.. విదేశీ ప్రయాణాలు చేయొద్దు.. బంగారం కొనుగోలు చేయొద్దు.. అనవసర ప్రయాణాలు వద్దు.. అనేది ఒక పార్శ్వం.. అదే జరిగితే కరోనా కన్నా పెద్ద సంక్షోభమేనని చెప్పాలి.. కరోనా సమయంలో జనం దగ్గర డబ్బులున్నాయి.. ఇప్పుడు జనం దగ్గర డబ్బుల్లేవ్.. క్రెడిట్ కార్డుల అప్పులు పేరుకుపోయాయి.. పర్సనల్ లోన్లు, ఈఎంఐలు.. ఇలా పరిస్థితి రోజురోజుకూ క్లిష్టతరంగా మారింది.
ఏఐ ప్రభావంతో సంక్షోభంలో సాఫ్ట్ వేర్ రంగం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సాఫ్ట్ వేర్ రంగం వేగంగా సంక్షోభంలో కూరుకుపోతోంది.. గూగుల్ లాంటి సంస్థ 75% ఏఐ మీద ఆధార పడుతోంది.. దాదాపు అన్ని సంస్థలు ఒక్కొక్కటిగా లే ఆఫ్ లు ప్రకటిస్తున్నాయి.. మెటా, ఇన్ఫోసిస్, ఒరాకిల్, లింక్డ్ ఇన్.. ఒక్కటేమిటి అన్ని సంస్థలు వేలాది మంది ఉద్యోగాలను తొలగించాయి. బహుళ జాతి సంస్థల్లో మనోళ్లు ఉద్యోగాలు కోల్పోవడంతో విదేశాల నుంచి వచ్చే డబ్బులు (డాలర్లు) ఆగిపోయాయి.
►ALSO READ | మళ్లీ 2012-13 లాంటి సంక్షోభం: డీకోడ్ చేసిన జెఫరీస్.. మోడీ మాటల వెనుక ఏం దాగి ఉందంటే..?
అమ్మకానికి ఫ్లాట్లు
రియల్ ఎస్టేట్ కుదేలైంది.. జనం దగ్గర డబ్బుల్లేక అల్లాడుతున్న పరిస్థితి. ఈ తరుణంలో హౌసింగ్ లోన్లు తీసుకున్న ఎంతో మంది ఉద్యోగులు.. తమ కొలువులు కోల్పోవడంతో ఇండ్లను వదిలేసుకుంటున్నారు. దీంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయి. వాటికి తిరిగి వేలం పాటలు నిర్వహించినా కొనే వారు కరువయ్యాయి.
లాక్ డౌన్ వస్తే జరిగేది ఇదే:
* రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది.. పట్టణాలకు రాకపోకలు తగ్గుతాయి
* దీని ప్రభావంతో టిఫిన్ సెంటర్లు, హొటళ్లు, చిరు వ్యాపారాలు దెబ్బతింటాయి
* టూరిజం రంగం దివాళా తీస్తుంది.. హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడతాయి
* బంగారం, జ్యుయలరీ, బట్టల వ్యాపారాలు దెబ్బతింటాయి..
* ఆన్ లైన్ పాఠాలు మొదలైతే స్కూల్ బస్సు డ్రైవర్లు ఉద్యోగాలు కోల్పోతారు
* కరోనా వేళ సెంట్రలైజ్డ్ ఆన్ లైన్ క్లాస్ రూమ్స్ నడిచాయి.. ఇప్పుడు ఏఐ టీచర్ పాఠాలు చెప్తుంది..
* సో ఒక్క టీచర్ కూడా అవసరం ఉండదు.. దీంతో ప్రైవేటు టీచర్ల ఉద్యోగాలు భారీగా పోతాయి.
* వర్క్ ఫ్రం హోంలు పెరుగుతాయి.. దీని ప్రభావంతో చాలా కార్యాలయాలు మూత పడతాయి.. లేదా చిన్న ఆఫీసుల్లోకి మారిపోతాయి..
* పెళ్లిళ్లు, శుభకార్యాలకు లిమిటెడ్ మందిని ఆహ్వానిస్తారు.. కేటరింగ్ సర్వీసులు, డెకోరేషన్లు, సంబంధిత వ్యాపారాలు దెబ్బతింటాయి..
మీడియా రంగంపైనా ప్రభావం తీవ్రంగా పడనుంది. ప్రింట్ మీడియాకు రవాణా కష్టాలు వస్తాయి.
* నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కుకింగ్ ఆయిల్.. వంట నూనెల ధరలు అమాంతం పెరుగుతాయి. ఈ విషయంలో ఇప్పటికే ప్రధాని మోదీ హింట్ ఇచ్చేశారు. వంట నూనె వినియోగం తగ్గించమని పిలుపునిచ్చారు కూడా..
ముందు సంపూర్ణ లాక్ డౌన్.. తర్వాత మినహాయింపులు!:
* ప్రజలు కొత్త జీవితానికి అలవాటు పడాలంటే ముందుగా సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉందనే చర్చ ఉంది.
* తర్వాత మినహాయింపులు మొదలవుతాయని చర్చ సాగుతోంది
* మొదట రైల్వేలు, లోకల్ ట్రైన్లు, మెట్రలో రైళ్లను ప్రారంభిస్తారు. ఇవన్నీ పవర్(విద్యుత్) తో నడిచేవే.
* తర్వాత దశలో ఎలక్ట్రిక్ బస్సులను అనుమతించే అవకాశం ఉంటుంది.
* ఆపై దశలో ఈవీ కార్లు, బైకులకు పర్మిషన్లు ఇస్తారు.. ఈవీ కార్లలో కూడా ప్రయాణికులకు పరిమితి విధించే అవకాశం ఉంది.
* ఈ ప్రభావంతో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ తో నడిచే వాహనాల షోరూంలు మూతపడే చాన్స్ ఉంది.. లేదా వ్యాపారాలు సాగవు.
* దీని ప్రభావం దాదాపు మూడేండ్ల వరకు సాగే అవకాశం ఉంది.
