
అఫ్గాన్‌లోని కాబూల్‌లో మంగళవారం జరిగిన మినీవ్యాన్ పేలుళ్లకు తామే కారణమని టెర్రరిస్ట్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. అఫ్గానిస్తాన్ ప్రధాన జైలు ఉద్యోగులకు చెందిన మినీవ్యాన్ లో తామే పేలుడు పదార్థాలను అమర్చినట్టు తెలిపింది. కాబూల్‌లోని అలోఖైల్ ప్రాంతంలో రెండ్రోజుల క్రితం పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు పౌరులు మరణించగా, నలుగురు గాయపడ్డారు. పోలీసు దర్యాప్తులో భాగంగా ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థలు ఈ ప్రాంతంలోని షియాలే లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడ్డాయి.