ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ ? : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ ? : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, వెలుగు: ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని పోలీసులు జుట్టు పట్టుకుని లాగడాన్ని బీఆర్‌‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్‌‌ యూనివర్సిటీల భూములను హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థినిపై పోలీసులు దాడి చేయటం అమానుషమని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తూ కవిత బుధవారం ట్వీట్ చేశారు. ఝాన్సీకి పోలీసులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని దాడికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.