నకిలీ డిగ్రీతో జడ్జిగా ఐదేళ్లు విధులు..పాకిస్తాన్లో వెలుగులోకి వచ్చిన ఉదంతం

నకిలీ డిగ్రీతో జడ్జిగా ఐదేళ్లు విధులు..పాకిస్తాన్లో వెలుగులోకి వచ్చిన ఉదంతం

ఇస్లామాబాద్: నకిలీ లా డిగ్రీతో ఇస్లామాబాద్ హైకోర్టులో ఐదేండ్లు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన ఒక జడ్జి ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టు అతడి నియామకం చెల్లదని తీర్పునిచ్చింది. అతడిని పదవి నుంచి తొలగిస్తూ116 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది.

 డాన్ పత్రిక కథనం ప్రకారం.. జస్టిస్ తారిక్ మహమూద్ జహంగీరీ 2020, డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఐదేండ్లు జడ్జిగా పలు తీర్పులు వెలువరించారు. జడ్జిగా నియమితులైన అనంతరం అధికారులు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలని అడిగారు. అయితే, అతడు మాత్రం వాటిని సమర్పించడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జహంగీరీ విధులు నిర్వహించకుండా అధికారులు నిషేధం విధించారు. 

కరాచీ యూనివర్సిటీ 1988లో జహంగీరీ నకిలీ ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పరీక్షకు హాజరయ్యాడు. ఆ సమయంలో కాపీ కొడుతూ పట్టుబడటంతో, 1989లో వర్సిటీ అతడిపై మూడేండ్ల పాటు నిషేధం విధించింది. దీంతో తర్వాతిఏడాది ఇంతియాజ్ అహ్మద్ అనే విద్యార్థికి కేటాయించిన ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్ నంబర్‌‌‌‌‌‌‌‌ను వాడుకుని, తారిక్ జహంగీరీ మళ్లీ పరీక్ష రాశాడు. గవర్నమెంట్ ఇస్లామియా లా కాలేజీ ప్రిన్సిపాల్ సైతం జహంగీరీ తమ సంస్థలో ఎన్నడూ చదువుకోలేదని పేర్కొంది. దీంతో కోర్టు అతడిని బాధ్యతల నుంచి తొలగించింది.