సిరియాపై ఇజ్రాయెల్ రాకెట్ దాడులు

సిరియాపై ఇజ్రాయెల్ రాకెట్ దాడులు
  • 14 మంది మృతి, 43 మందికి గాయాలు

డమాస్కస్:సిరియాపై ఇజ్రాయెల్ రాకెట్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో14 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం సెంట్రల్ సిరియా లోని అనేక ప్రాంతాలపై ఇజ్రాయెల్ రాకెట్ దాడులు చేసింది. దీంతో హమాస్ ప్రావిన్స్లోని రోడ్డు దెబ్బతిని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో14 మంది చనిపో యారని, 43 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. 

నిపోయిన వారిలో కనీసం నలుగురు పౌరులు ఉన్నారని తెలుస్తోంది. మైసాఫ్ లోని సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఓ రాకెట్ ను ప్రయోగించింది. తీర ప్రాంతమైన టార్టస్ సిటీపై కూడా రాకెట్లతో దాడులు చేసింది. 

 దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ మిలిటరీ ఇంత వరకు స్పందించలేదు. సిరియాలోని ప్రభుత్వ నియంత్రిత లక్ష్యాలపై ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్  వందల కొద్దీ దాడులు చేసింది. సిరియన్ బలగాలు, ఇరాన్ మద్దతున్న గ్రూపులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది.