ఎవిన్ జైలు గోడలు బద్దలుకొట్టిన డ్రోన్ బాంబులు : ప్రపంచంలోనే డేంజరస్ ప్లేస్ ఇదేనంట..!

ఎవిన్ జైలు గోడలు బద్దలుకొట్టిన డ్రోన్ బాంబులు : ప్రపంచంలోనే డేంజరస్ ప్లేస్ ఇదేనంట..!

ఇజ్రాయెల్ దాడులు అలా ఇలా లేవు.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ టార్గెట్ గా విచ్చలవిడిగా.. బీభత్సంగా బాంబులు వేస్తోంది. డ్రోన్ బాంబులతో జూన్ 23వ తేదీ రోజంతా టెర్రర్ పుట్టించింది ఇజ్రాయెల్. ఇరాన్ దేశంలోని ఆరు ఎయిర్ పోర్టులపై దాడుల తర్వాత.. టెహ్రాన్ సిటీలోని ఎవిన్ జైలుపై బాంబులు వేసింది. ఈ జైలు అంటేనే అందరూ వణికిపోతారు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లను.. తిరుగుబాటు చేసేవాళ్లను ఈ జైలులో ఉంచుతారు. ఇక్కడే కోర్టు ఉంటుంది.. ఇక్కడ ఉరిశిక్ష వేస్తారు.. జైలులోనే పూడ్చిపెడతారు.. ఈ ఎవిన్ జైలుపై.. ఇందులో శిక్షలపై గతంలోనే అంతర్జాతీయంగా చాలా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఈ జైలుపై ఇజ్రాయెల్ ఎటాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ALSO READ | ఇరాన్ లోని 6 ఎయిర్ పోర్టులపై ఇజ్రాయెల్ దాడులు : 15 యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు పేల్చివేత

ఎవిన్ జైలును ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నిర్వహిస్తుంది. ఇక్కడ పని చేసే వాళ్లు నేరుగా ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీతోనే మాట్లాడతారు.. వాళ్లే విచారిస్తారు.. వాళ్లే శిక్షలు అమలు చేస్తారు. ఈ జైలు అంటే నరకం అన్నట్లే.. ఎవరైనా ప్రభుత్వానికి, సుప్రీంకు వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే వాళ్లను ఈ ఎవిన్ జైలుకు తరలించి.. చిత్ర హింసలకు గురి చేస్తారు. 

ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా.. గూఢచర్యం చేసినా ఈ జైలులోనే ఉంచుతారు. యుద్ధ ఖైదీలను కూడా ఇందులోనే ఉంచుతారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రత్యేకంగా దీన్ని నిర్వహిస్తుంది. ఈ జైలును టార్గెట్ చేసి.. ఇజ్రాయెల్ డ్రోన్ బాంబులు వేసింది. జైలు గోడలను బద్దలుకొట్టే వీడియో వైరల్ అవుతుంది. ఈ దాడిలో జైలు బాగా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరైనా చనిపోయారా లేదా అన్నది తెలియరాలేదు. దాడి అయితే జరిగింది అని ఇరాన్ మీడియా తెలిపింది. ప్రస్తుతం జైలులో ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటీ అనే విషయంలో స్పష్టత రాలేదు. 

ఇరాన్ దేశంలోని చాలా మంది రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్షం వాళ్లు కొన్నేళ్లుగా ఈ ఎవిన్ జైలులోనే మగ్గిపోతున్నట్లు సమాచారం. డ్రోన్ దాడి తర్వాత వాళ్ల పరిస్థితి ఏంటీ.. బతికే ఉన్నారా లేదా అనేది కూడా తెలియరాలేదు.