బైక్​పై వెంటాడి మరీ కాల్పులు

బైక్​పై వెంటాడి మరీ కాల్పులు
  • హమాస్​ మిలిటెంట్లను ఏరిపారేస్తున్న ఇజ్రాయెల్ ​సైన్యం

టెల్​అవీవ్: హమాస్​ మిలిటెంట్ల ఏరివేతలో ఇజ్రాయెల్‌‌‌‌ సైన్యంతో కలిసి అక్కడి పోలీసులు చేపడుతున్న ఆపరేషన్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌‌‌‌ బార్డర్ పోలీసులు హమాస్‌‌‌‌ మిలిటెంట్లను వెంటాడిన వీడియో ఒకటి వైరల్​గా మారింది. ఆ దేశ సైన్యంతో పాటు పోలీసులు బార్డర్ ఏరియాను జల్లెడ పడుతూ హమాస్‌‌‌‌ మిలిటెంట్లను ఏరిపారేస్తున్నారు. 

ఈ క్రమంలో కారులో పారిపోతున్న హమాస్ మిలిటెంట్ల​ను వెంటాడి హతమార్చిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. సినిమాలో ఛేజింగ్‌‌‌‌ సీన్‌‌‌‌ ను తలదన్నేలా ఉన్న ఈ వీడియోను ఇజ్రాయెల్‌‌‌‌ పోలీసు విభాగం ఎక్స్​(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కనిపిస్తున్న కాల్పుల విజువల్స్​సినిమా సీన్​ను తలపిస్తున్నాయి. హమాస్‌‌‌‌ మిలిటెంట్లు ప్రయాణిస్తున్న కారును ఇజ్రాయెల్‌‌‌‌ పోలీసు ఒకరు తన బైక్‌‌‌‌తో వెంబడించాడు. 

ఈ క్రమంలో మిలిటెంట్ల కారు సమీపంలోకి వెళ్లి బైక్‌‌‌‌ పై నుంచి ఒంటి చేత్తోనే గన్​తో కాల్పులు జరిపాడు. అదే సమయంలో మరో కారులో వెనకే వచ్చిన ఇంకో ఇద్దరు పోలీసులు మిలిటెంట్లపై పలు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన విజువల్స్ పోలీసు బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇజ్రాయెల్ పోలీసులను ప్రశంసిస్తున్నారు.