ఇజ్రాయెల్ యుద్ధంతో ఎగిరి గంతేస్తున్న ఐటీ ఉద్యోగులు

ఇజ్రాయెల్ యుద్ధంతో ఎగిరి గంతేస్తున్న ఐటీ ఉద్యోగులు

ప్రస్తుతం ఇజ్రాయెల్ లో  హమాస్ ఉగ్రవాదుల దాడులు, ఇజ్రాయెల్ సైన్యం ప్రతీకార దాడులతో భీకర యుద్దం కొనసాగుతోంది. ఈ సమయంలో అక్కడి టెక్ కంపెనీ ల పరిస్థితి గందరగోళంలో పడింది. తమ కంపెనీలకు సెక్యూరిటీ  లేదని ఆందోళన వ్యక్తం భావిస్తున్నాయి. అక్కడ పనిచేస్తున్న టెకీలు అందరూ వెనక్కి వచ్చేస్తు న్నారు. యుద్దం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కేంద్రంగా నడుస్తున్న ప్రాజెక్టులను ఇండియాకు కేటాయించాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. 

ఇజ్రాయేల్ ఆదాయంలో 14 శాతం ఐటీ ఆధారితంగానే ఉన్నాయి.. ఐటీనే ఇజ్రాయేల్ దేశానికి కీలక ఆదాయం.. హమాస్, పాలస్తీనాతో జరుగుతున్న యుద్ధంతో  ఇజ్రాయేల్ లోని ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఆందోళనలో పడ్డారు. అమెరికా, యూకే, చైనా, ఫ్రాన్స్, ఇతర దేశాలకు చెందిన ఐటీ ప్రాజెక్టులకు  ప్రస్తుతం ఇజ్రాయేల్ లో వర్క్ జరుగుతుంది.  ముష్కరుల దాడుల కారణంగా స్టాక్, బాండ్ ధరలు పడిపోయాయి. ఇప్పుడు యుద్ధం క్రమంలో ఉద్యోగుల భద్రత విషయంలో ఆయా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఐటీ ప్రాజెక్టులను ఇండియాకు తరలించాలనే ఆలోచన చేస్తున్నాయంట.. అదే విధంగా ఇజ్రాయేల్ దేశానికి ఇద్దామనుకున్న ఐటీ ప్రాజెక్టుల విషయంలో పునరాలోచనలో పడ్డాయంట.
ఇది ఇప్పుడు ఇండియాన్ ఐటీ ఇండస్ట్రీకి వరంగా మారింది.. ఆ ప్రాజెక్టులు ఇండియాకు వస్తే.. ఐటీ ఉద్యోగాలు మరిన్ని వస్తాయని.. మరిన్ని నియామకాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు భారత ఐటీ నిపుణులు.

ఇజ్రాయేల్ దేశంలో కీలక భూమిక పోషించేది ఐటీ రంగమే.. చాలా ఎక్కువ ప్రాజెక్టులు అక్కడ నుంచి రన్ అవుతున్నాయంట.. ఇవన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తే.. ఇండియాకు తరలి వస్తే మాత్రం. కనీసం 10 వేల మందికి కొత్తగా ఐటీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.