అపజయం గెలుపునకు నాంది : ఇస్రో చైర్మన్ సోమనాథ్

అపజయం గెలుపునకు నాంది : ఇస్రో చైర్మన్ సోమనాథ్

రాకెట్‌ రూపకల్పనలో తాను ఎన్నో తప్పులు చేశానని, అపజయం గెలుపునకు పాఠం లాంటిందని ఇస్రో చైర్మన్​ సోమనాథ్‌ అన్నారు. కూకట్ పల్లిలోని జేఎన్టీయూలో జరిగిన కాన్వొకేషన్​లో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను వీసీ ప్రొ.కట్టా నరసింహారెడ్డి అందజేశారు.  ఈసందర్భంగా ఇస్రో చీఫ్ మాట్లాడుతూ తన జీవితంలో ఎన్నో పరాజయాలు చూసానని ఆ టైంలో ఎవరూ మిమ్మల్ని పట్టించుకోరని అన్నారు.

 ఇండస్ట్రీ వృద్ధి...హెరిటేజ్ లో హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందని సోమనాథ్ చెప్పారు.. వర్సిటీలతో కలిసి పనిచేయడంపై వీసీతో చర్చించాని. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చంద్రయాన్‌ –3 దేశం మొత్తం గర్వించేలా చేసిందని చెప్పారు. పరాజయాలు అధిగమించి 3 ప్రాజెక్టుల్లో విజయం సాధించామన్నారు. 

ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలని సూచించారు. స్పేస్ రంగంలో మరిన్ని స్ట్రాటప్ లు...ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉందని సోమనాథ్ తెలిపారు. అనంతరం కాన్వొకేషన్ సందర్భంగా గోల్డ్ మెడల్స్, పట్టాలు అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు.