లవ్ మ్యారేజ్ చేసుకున్న.. జంటకు కుల బహిష్కరణ?

లవ్ మ్యారేజ్ చేసుకున్న.. జంటకు కుల బహిష్కరణ?

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రేమ వివాహం చేసుకున్నందుకు తమను కుల బహిష్కరణ చేశారంటూ ఓ దంపతులు సోమవారం జగిత్యాల గ్రీవెన్స్​లో కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి వివరాల ప్రకారం, ధర్మపురి మండలం దొంతపూర్‌‌కు చెందిన సంగీత 2023 డిసెంబర్‌‌లో బీర్పూర్ మండలం కోమనపల్లి గ్రామానికి చెందిన పవన్ ను కులాంతర వివాహం చేసుకుంది. 

దీంతో అబ్బాయి కులానికి చెందిన కొందరు పెద్దలు ఆగ్రహంతో తమపై కుల బహిష్కరణ విధించారని ఆరోపించింది. ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు హాజరుకాకుండా అడ్డుకుంటున్నారని, సామాజికంగా దూరం పెడుతున్నారని దంపతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై గత నెలలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.