ఇస్రో మరో ఘనత..PSLV C46 సక్సెస్

ఇస్రో మరో ఘనత..PSLV C46 సక్సెస్

ఇస్రో మరో ఘన విజయం సాధించింది.  షార్‌ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సి46 రాకెట్‌ విజయవంతంగా కక్షలోకి ప్రవేశ పెట్టింది. 615 కిలోల బరువు గల రీషాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ 46 రాకెట్ 557 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి తీసుకెళ్లింది. దీంతో పీఎస్ ఎల్వీ సీ 46 ప్రయోగం విజయవంతం అయ్యింది. దీంతో షార్ లో సంబరాలు మిన్నంటాయి.

మంగళవారం ఉదయం 4.30 గంటలకు  కౌంట్ డౌన్ స్టార్ట్ అయి బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ46 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ బయల్దేరిన తర్వాత 15.29 నిముషాలకు రీషా్-2బీఆర్1 ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయింది. ఈ ఉప గ్రహం ఐదేళ్లు పనిచేస్తుంది.

రక్షణ శాఖలో శత్రువుల కదలికలను గుర్తించడానికి,  అలాగే వ్యవయసాయం, అటవిసంరక్షణ, విపత్తుల సమయాల్లో ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది.

ప్రయోగం సక్సెస్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్  అభినందనలు తెలిపారు.