
- 14న మరోసారి కక్ష్య తగ్గించనున్న ఇస్రో
- 23 న ల్యాండర్ చంద్రుడి మీద దిగే చాన్స్
బెంగళూరు: చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరగా చేరుకుందని ఇస్రో వెల్లడించింది. ఇంజిన్‌ను మరోసారి మండించి స్పేస్ క్రాఫ్ట్ కక్ష్య ను తగ్గించామని, ప్రస్తుతం చంద్రుడి ఉపరితలం నుంచి 174 కిమీ x 1437 కిలోమీటర్ల కక్ష్యలో స్పేస్ క్రాఫ్ట్ తిరుగుతోందని పేర్కొంది.
ఈ నెల 14న మరోసారి కక్ష్యతగ్గిస్తామని, ఈ నెల 16న చంద్రుడికి 100 కిలోమీటర్ల చేరువకు చేర్చేందుకు చివరి ఆపరేషన్ చేపడతామని తెలి పింది. ఆ మరుసటి రోజే ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్‌ను ఆర్బిటర్ నుంచి వేరు చేస్తామని పేర్కొంది. కాగా, జులై 14న సక్సెస్‌ఫుల్‌గా చంద్రయాన్-3 ను స్పేస్‌లోకి పంపించిన ఇస్రో సైంటిస్టులు, కొద్దిరోజు లుగా దశలవారీగా కక్ష్యను పెంచుతూ వచ్చారు. ఆగస్ట్ 5న చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోకి ఎంటర్ అయింది. ఈ నెల 23 న విక్రమ్ ల్యాండర్‌ను మూన్‌పై ల్యాండ్ చేయనున్నారు.
ఈసారి పొరపాటు జరగదు: ఇస్రో చీఫ్
చంద్రయాన్-2 ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న పాఠాలతో చంద్రయాన్-3 మిషన్‌ను ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ల్యాండర్‌ను డీబూస్ట్ చేసే క్రమంలో చంద్రయాన్-2 మాదిరిగా చివరి నిమిషంలో సమస్యలు తలెత్తితే ఎలా అనే సందేహాలపై ఇస్రో చీఫ్ సోమనాథ్ క్లారిటీ ఇచ్చారు. చంద్రయాన్-3 లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే విక్రమ్ ల్యాండర్ దానికదే సరిచేసు కుంటుందన్నారు.
సెన్సర్లతో పాటు అందులోని రెండు ఇంజిన్లు పాడైనాసరే విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్‌గా ల్యాండ్ అవగలిగే లేటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉందన్నారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరుకాగానే ల్యాండర్ అడ్డంగా తిరగకుండా, సరైన రీతిలో నిలువుగా కిందకు దిగేలా ల్యాండర్‌ను డిజైన్ చేశామని చెప్పారు. గతంలో ల్యాండర్ అడ్డంగా కిందకు దిగడంతోనే ఫెయిల్ అయింద న్నారు. ఆ పొరపాటు ఈసారి జరిగే చాన్స్ లేదని, చంద్రయాన్-3 సాఫ్ట్ గా ల్యాండ్ అవడం ఖాయమని సోమనాథ్ చెప్పారు.