30 ఏళ్లకే ఇస్రోలో సైంటిస్ట్ అయ్యే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి..

30 ఏళ్లకే ఇస్రోలో సైంటిస్ట్ అయ్యే ఛాన్స్.. త్వరగా అప్లై చేసుకోండి..

భారత అంతరిక్ష సంస్థకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఇస్రో ఎన్ఆర్ఎస్​సీ), హైదరాబాద్​ సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 18.

పోస్టులు: 33 (సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్​సీ)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, ఎంఎస్సీ, ఎంఈ లేదా ఎంటెక్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జూన్ 18. 
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.33 మార్కులు కోత విధిస్తారు. తుది ఎంపికలో రాత పరీక్ష 50 శాతం, ఇంటర్వ్యూకు 50 శాతం వెయిటేజీ ఉంటుంది. పూర్తి వివరాలకు  www.nrsc.gov.in వెబ్​సైట్​లోచూడగలరు.