గురుకులాల్లో ఐఐటీ, నీట్ ఫ్యాకల్టీ పోస్టులు

గురుకులాల్లో ఐఐటీ, నీట్ ఫ్యాకల్టీ పోస్టులు

గండిపేట, వెలుగు: గురుకుల స్టూడెంట్లకు ఐఐటీ, నీట్ క్లాసులు చెప్పేందుకు అధ్యాపకుల కోసం ఈ నెల 3న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సాంఘిక సంక్షేమ గురుకుల ప్రాంతీయ సమన్వయాధికారి డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శారదా వెంకటేశ్​ ఓ ప్రకటనలో తెలిపారు. చిలుకూరు, నార్సింగి, గౌలిదొడ్డి(బాలురు), బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో ఐఐటీ, నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసులు చెప్పేందుకు ఎక్స్ పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కావాలన్నారు. ఎంపికైన అధ్యాపకులు కనీసం రెండేండ్ల పాటు క్లాసులు చెప్పేలా ఒప్పంద పత్రం రాసి ఇవ్వాలన్నారు.  

చిలుకూరులో ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1, నార్సింగిలో ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1, గౌలిదొడ్డి(బాలికలు) మ్యాథ్స్​–2, ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2, కెమిస్ట్రీ–3, జువాలజీ–1 ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న వారు టీచింగ్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్, ఆయా సబ్జెక్టుల్లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లతో  శనివారం ఉదయం 10 గంటలకు గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల స్కూల్ లో జరిగే ఇంటర్వ్యూకు హజరుకావాలని తెలిపారు.