- ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు వసూల్
- డబ్బులతో పరారైన ఎన్ఎస్ఎన్ఇన్ఫోటెక్ నిర్వాహకులు
మాదాపూర్, వెలుగు: ఏడాది కిందటే కంపెనీ తెరిచారు. ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు వల వేశారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు రూ.3 లక్షల వరకు వసూల్ చేశారు. ఆరు నెలలపాటు వర్క్‌ఫ్రమ్ హోమ్ పేరిట ట్రైనింగ్ఇచ్చి జీతాలూ ఇచ్చారు. ఆ తర్వాత అసలు సినిమా మొదలుపెట్టి జీతాలు ఇవ్వకుండా రోజులు గడుపుతూ బోర్డు తిప్పేసింది. దీంతో చేసేదేమీలేక బాధితులంతా లబోదిబోమంటూ పోలీస్స్టేషన్మెట్లెక్కారు.
మాదాపూర్ ఇన్స్పెక్టర్కృష్ణమోహన్ వివరాల ప్రకారం.. సిటికి చెందిన శ్రీనివాస్, స్వామి నాయుడు ఇద్దరు కలిసి ఏడాది కింద కొండాపూర్లోనిగూగుల్ ఆఫీస్పక్కనే ఎన్ఎస్ఎన్ఇన్ఫోటెక్పేరుతో ఐటీ కంపెనీ ప్రారంభించారు. శ్రీనివాస్సీఈవోగా, స్వామినాయుడు డైరెక్టర్‌గా కొనసాగుతూ.. తమ కంపెనీలో ఐటీ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున వసూల్ చేశారు. ఆరు నెలల పాటు వర్క్‌ఫ్రమ్ హోమ్ పేరిట ట్రైనింగ్ఇచ్చి జీతాలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి సగం మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా రోజులు గడుపుతూ వస్తున్నారు.
నెల రోజుల క్రితం పలువురు ఉద్యోగులు తమ జీతాల కోసం ఆఫీస్వద్దకు వచ్చి చూసేసరికి కంపెనీ క్లోజ్‌చేసి ఉండడంతో మోసపోయినట్లు గుర్తించారు. కంపెనీ సీఈఓ, డైరెక్టర్, హెచ్‌ఆర్‌లను సంప్రదించినా స్పందించకపోవడంతో బుధవారం మాదాపూర్పీఎస్లో ఫిర్యాదు చేశారు.
ఇప్పటివరకు దాదాపు 20 మంది బాధితులు స్టేషన్‌కు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఐటీ ఉద్యోగం కోసం డబ్బులు కట్టిన బాధితులు 300 మంది వరకు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇన్స్పెక్టర్తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
