హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌ లాభం రూ.4,234 కోట్లు

హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌ లాభం రూ.4,234 కోట్లు
  • మొత్తం ఆదాయం రూ.31,942 కోట్లు
  • షేరుకు రూ.12 ఇంటెరిమ్‌‌‌‌ డివిడెండ్‌‌‌‌ 
  • పెరుగుతున్న ఏఐ ఆదాయం
  • యూఎస్‌‌‌‌, యూకే, యూరప్‌‌‌‌లలో భారీగా ఆర్డర్లు గెలుచుకున్న కంపెనీ

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్ ఈ  ఏడాది  జులై–సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ2) లో   రూ.4,235 కోట్ల నికర  లాభాన్ని (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌) సాధించింది.  గతేడాది ఇదే క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే కంపెనీ ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌గా ఉంది. కానీ, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ1) ‌‌‌‌‌‌‌‌లో  వచ్చిన  లాభం రూ.3,843 కోట్లతో పోలిస్తే 10.2 శాతం వృద్ధి నమోదు చేసింది. క్యూ2 లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.31,942 కోట్లకు చేరింది. 

ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 10.7 శాతం, క్యూ1 ‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 5.25 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ ఏడాది క్యూ1లో కంపెనీ ఆదాయం రూ.30,349 కోట్లు కాగా, కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.28,862 కోట్లు సాధించింది. కంపెనీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ రోషిణీ నాడార్ మల్హోత్రా మాట్లాడుతూ, “సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా అనిశ్చితులు పెరిగాయి. అయినప్పటికీ మేము మంచి రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ సాధించాం.  

కొత్త టెక్నాలజీలు, సామర్థ్యాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి పెంచుకోవాలని చూస్తున్నాం.  ఉద్యోగుల స్కిల్స్‌‌‌‌‌‌‌‌ పెంచడంపై ఫోకస్ పెట్టాం.  మా క్లయింట్లకు ఇన్నోవేషన్స్‌‌‌‌‌‌‌‌ అందించడంలో ఇది కీలకం” అని తెలిపారు.

గైడెన్స్‌‌‌‌‌‌‌‌లో మార్పు లేదు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం కంపెనీ తన ఆదాయం, ఇబిటా మార్జిన్ గైడెన్స్‌‌‌‌‌‌‌‌ను కొనసాగిస్తోంది. స్థిర కరెన్సీలో ఆదాయం ఏడాది లెక్కన 3–5 శాతం పెరుగుతుందని,  సేవల ఆదాయం 4–5 శాతం  పెరుగుతుందని అంచనా. ఇబిటా మార్జిన్ 17–18 శాతంగా ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. క్యూ2 లో హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ టెక్ 3,489 ఉద్యోగులను, 5,196 ఫ్రెషర్లను నియమించింది. సెప్టెంబర్ చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,26,640గా ఉంది.  

జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే  3,489 మంది ఉద్యోగులు  పెరిగారు. అట్రిషన్ రేట్ 12.6 శాతంగా ఉంది.  ఇది గత సంవత్సరం క్యూ2లో 12.9 శాతంగా ఉంది.  క్యూ2 కి గాను  రూ.2 ముఖ విలువ గల షేరుకు రూ.12 ఇంటెరిమ్‌ డివిడెండ్‌‌‌‌‌‌‌‌ను హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. ఇది వరుసగా 91వ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ  డివిడెండ్ ప్రకటించింది.  ఈ నెల 17 రికార్డ్ డేట్. క్యూ2లో కొత్త ఒప్పందాల మొత్తం విలువ 2,569 మిలియన్ డాలర్లు. కంపెనీ యూఎస్‌‌‌‌‌‌‌‌, యూకే , యూరప్‌‌‌‌‌‌‌‌లో కీలక ఒప్పందాలు గెలుచుకుంది.  

“ఏఐ ఆధారిత సొల్యూషన్లకు  డిమాండ్ పెరుగుతోంది. అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌ ఏఐ ద్వారా క్యూ2లో  వచ్చిన ఆదాయం 100 మిలియన్ డాలర్లు దాటింది. కొత్త బుకింగ్స్ 2.5 బిలియన్ డాలర్లు దాటాయి.  ఉద్యోగుల సంఖ్య పెంచుకుంటున్నాం.  రెవెన్యూ- పర్- ఎంప్లాయీ ఏడాది లెక్కన 1.8 శాతం పెరిగింది. ఇది మా ఏఐ వ్యూహానికి అనుగుణంగా ఉంది” అని హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్ సీఈఓ విజయకుమార్  తెలిపారు.

మెరుగుపడిన మార్జిన్స్‌‌‌‌

క్యూ2 లో కంపెనీ ఆదాయం  డాలర్లలో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదకన 2.8 శాతం , ఏడాది లెక్కన 5.8 శాతం  పెరిగి 3,644 మిలియన్‌‌‌‌ డాలర్లకు చేరింది.  కంపెనీ ఇబిటా (ఆపరేటింగ్ ప్రాఫిట్‌‌‌‌) రూ.5,550 కోట్లకు చేరింది. ఇది ఆదాయంలో 17.4 శాతానికి సమానం. ఇది క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదకన 12.3 శాతం, ఏడాది లెక్కన 3.5 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఇబిటా మార్జిన్ 17.5 శాతంగా ఉంది.  ఇది క్యూ1లో 16.3 శాతం, గత సంవత్సరం 18.6 శాతంగా ఉంది. 

ఖర్చులు తగ్గించుకోవడంతో  మార్జిన్స్ స్వల్పంగా పెరిగాయి.  “క్యూ2లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ప్రాతిపదకన 5.2 శాతం ,  ఏడాది లెక్కన 10.7 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేశాం. లాభదాయకత, క్యాష్ జనరేషన్ బలంగా ఉంది. గత 12 నెలల్లో ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్‌‌‌‌సీఎఫ్‌‌‌‌) రేషియో 125 శాతంగా ఉంది” అని హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌‌‌‌ సీఎఫ్‌‌‌‌ఓ శివ్ వాలియా అన్నారు.  అలాగే, కంపెనీ క్యాపిటల్ ఎఫిషియెన్సీ మెరుగుపరచడంపై కట్టుబడి ఉన్నామని, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ క్యాపిటల్ (ఆర్‌‌‌‌‌‌‌‌ఓఐసీ) 38.6 శాతంగా ఉందని, ఇది ఏడాది లెక్కన 2.90 శాతం పెరిగిందని చెప్పారు. సేవల విభాగ ఆర్‌‌‌‌‌‌‌‌ఓఐసీ 45.3 శాతంగా ఉందన్నారు.