ఇవి మానేయడం బెటర్

ఇవి మానేయడం బెటర్

చర్మం అందంగా కనిపించాలని రకరకాల కాస్మొటిక్స్​ వాడుతుంటారు. అయితే, వాటిలో కెమికల్స్​ ఉండటం వల్ల స్కిన్​ పాడవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే... వాటిని వాడటం మానేయాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. 

  • ముఖం కడుక్కునేందుకు ఫేస్ వాష్​ లేదా ఫేస్​ కోసం స్పెషల్​గా ఉండే సోప్​ మాత్రమే వాడాలి. ఒంటికి వాడే సోప్​ ఫేస్​కి వాడితే స్కిన్​ సెన్సిటివ్​ అయిపోతుంది. 
  • జిడ్డు చర్మం ఉన్నవాళ్లు పెట్రోలియం జెల్లీ రాస్తే  పగుళ్లు, మచ్చలు ఎక్కువ అవుతాయి. అందుకని ముఖానికి ఏదైనా రాయాలంటే లైట్ వెయిట్ మాయిశ్చరైజర్​ రాసుకోవాలి. అవి కూడా హెల్దీ ప్రొడక్ట్స్ వాడి తయారుచేసినవైతే స్కిన్​లో కలిసిపోతుంది. 
  • మొటిమలు, మచ్చలు పోవడానికి టూత్​పేస్ట్ వాడుతుంటారు. అందులో ఉండే కెమికల్స్​ స్కిన్​కి సరిపడకపోతే చర్మం కాలిపోతుంది. 
  • బాడీలోషన్స్​ను​ కూడా ముఖానికి, మెడకు రాస్తుంటారు. వాటిలో హెవీ కెమికల్స్​ వాడతారు. దాంతో బాడీ లోషన్స్​ వాడటం వల్ల కూడా చర్మం సున్నితంగా మారుతుంది.