బీఆర్‌‌‌‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్లలో..రెండో రోజు ఐటీ సోదాలు

బీఆర్‌‌‌‌ఎస్ ఎంపీ,  ఎమ్మెల్యేల ఇండ్లలో..రెండో రోజు ఐటీ సోదాలు
  • రెండేండ్ల ఐటీ చెల్లింపుల్లో 
  • తేడాల గుర్తింపు!.. రెయిడ్స్​ ముగిశాక నోటీసులు ఇచ్చే చాన్స్​
  • ఆడిట్​ రికార్డ్స్, ఐటీ చెల్లింపుల రిసీట్స్​ పరిశీలన
  • బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్‌‌ గుర్తించిన ఆఫీసర్లు
  • లాకర్స్​లో భారీగా డాక్యుమెంట్లు
  • సోదాలు అడ్డుకునేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌ క్యాడర్ ఆందోళనలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్యేలు శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఇండ్లు, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం ప్రారంభమైన సెర్చెస్‌‌‌‌ గురువారం కూడా కొనసాగాయి. ఐదు రోజుల సెర్చ్‌‌‌‌ వారెంట్‌‌‌‌తో అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఢిల్లీ, ఒడిశా స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌  సోదాలు  చేస్తున్నాయి. రెండో రోజు తనిఖీల్లో భాగంగా ముగ్గు రు నేతల కంపెనీలకు చెందిన వివిధ బ్యాంక్‌‌‌‌ అకౌం ట్స్, లాకర్స్‌‌‌‌, ఆడిట్ రిపోర్ట్స్‌‌‌‌, బ్యాలెన్స్ షీట్స్‌‌‌‌ను ఆఫీసర్లు సేకరించారు. ఒక్కో కంపెనీకి చెందిన ఐదేండ్ల ఆర్థిక లావాదేవీల రికార్డులను డిటైల్​గా పరిశీలించారు. కంపెనీల ఆదాయం, ఖర్చులు, ఐటీ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను, అకౌంట్స్‌‌‌‌ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

క్యాష్​ రూపంలో భారీ ట్రాన్సాక్షన్స్!

హైదరాబాద్‌‌‌‌, బెంగళూర్‌‌‌‌లో వీరు భారీ రియల్ ఎస్టేట్‌‌‌‌ ప్రాజెక్ట్స్‌‌‌‌ చేసినట్లు ఐటీ అధికారులు ఆధా రాలు సేకరించారు. వెంచర్స్, విల్లాస్ అమ్మకాల్లో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ చెల్లింపులు కాకుండా క్యాష్‌‌‌‌ రూపంలోనే డబ్బు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకోసం కస్టమర్ల వివరాలను సేకరించినట్లు తెలిసింది. కంపెనీల ఆడిటర్‌‌‌‌‌‌‌‌లు, అకౌంట్స్‌‌‌‌ను ప్రశ్నించారు. చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్స్‌‌‌‌ ఆధ్వర్యంలో ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ట్రాన్సాక్షన్స్‌‌‌‌ను పరిశీలించారు. ఐటీ, జీఎస్‌‌‌‌టీ గురించి వివరాలు సేకరించారు. గత రెండేండ్ల ఐటీ చెల్లింపులు, కంపెనీల ట్రాన్సాక్షన్స్‌‌‌‌ మధ్య భారీ వ్యత్యాసాలు గుర్తించినట్లు సమాచారం.

లాకర్స్ ​ఓపెన్.. డాక్యుమెంట్లు, నగల గుర్తింపు

ఐటీ చెల్లింపులకు సంబంధించిన రశీదులు, ఆన్‌‌‌‌ లైన్‌‌‌‌ డిజిటల్‌‌‌‌ డాక్యుమెంట్స్‌‌‌‌ గురించి వివరణ తీసుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, కంపెనీల అకౌంట్‌‌‌‌ హోల్డర్స్‌‌‌‌ వద్ద సంబంధిత ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్స్‌‌‌‌ను గుర్తించారు. ఆయా బ్యాంక్ మేనేజర్స్‌‌‌‌ సమక్షంలో ఓపెన్ చేశారు. డాక్యుమెంట్లను, విలువైన ఆభరణాలను గుర్తించినట్లు తెలిసింది. వీటికి సంబంధించిన వివరాలను రికార్డ్ చేసుకున్నట్లు సమాచారం. రైడ్స్ పూర్తయిన తరువాత నోటీసులు ఇచ్చేందుకు ఐటీ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఐటీ ఆఫీసర్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన

ఐటీ సోదాలు జరుగుతుండగానే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్‌‌‌‌ రోడ్‌‌‌‌ నంబర్ 36లోని మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి నివాసం వద్దకు భారీ సంఖ్యలో వచ్చారు. గేట్ల ముందు బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం, సోదాలు చేస్తున్న ఐటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జూబ్లీహిల్స్‌‌‌‌లో ట్రాఫిక్ జామ్‌‌‌‌ అయ్యింది. కొత్తపేట్‌‌‌‌లోని పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇంటి వద్ద కూడా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఐటీ అధికారుల అనుమతితో శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి బయటకు వచ్చి కార్యకర్తలతో మాట్లాడారు. ఐటీ అధికారులు తమ పని తాము చేసుకుంటున్నారని చెప్పారు. అధికారులకు సహకరిస్తున్నట్లు తెలిపారు. అందరిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

అధికారుల వద్దే ఎమ్మెల్యేల ఫోన్స్‌‌‌‌

బుధవారం ఉదయమే ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది సెల్‌‌‌‌ఫోన్స్‌‌‌‌ను ఐటీ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెండు రోజులుగా ఎమ్మెల్యేల ఫోన్స్ అధికారుల వద్దనే ఉన్నాయి. సోదాలు జరుగుతున్న ప్రాంతాల్లోకి అత్యవసర పరిస్థితిలో మినహా ఇతరులను ఎవ్వరిని అనుమతించడం లేదు. మర్రి జనార్దన్‌‌‌‌రెడ్డి తల్లి బుధవారం అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. ప్రధానంగా పైళ్ల శేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మర్రి జనార్ధన్‌‌‌‌ రెడ్డి, కొత్త ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కలిసి చేసిన రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌, మైన్స్‌‌‌‌ సహా ఇతర ఆదాయ వ్యవహారాలపైనే ఐటీ ఫోకస్ పెట్టింది. ఇందులో హిల్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌, మైన్స్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌, తీర్థ ప్రాజెక్ట్ ప్రైవేట్‌‌‌‌లిమిటెట్‌‌‌‌, శ్రీ లార్వెన్‌‌‌‌ సిండికేట్‌‌‌‌ సంస్థల్లో ఈ ముగ్గురికి చెందిన కుటుంబసభ్యులే డైరెక్టర్స్‌‌‌‌, పార్ట్​నర్స్​గా ఉన్నారు.

సోదాలు ముగిశాక వాళ్ల సంగతి చూస్త..

‘‘రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నరు. మేమంతా సహకరిస్తున్నం. కొంతమంది సిబ్బందిని ఐటీ అధికారులు బెదిరించారని తెలిసింది. మ్యాన్‌‌‌‌ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నట్టు తెలిసింది. అధికారులకు చేయి చేసుకునే హక్కు లేదు. అలా జరిగితే మేము కూడా తిరిగి దాడులు చేస్తం. సోదాలు ముగిసిన తరువాత వారి సంగతి చూస్తం. మమ్మల్ని ఎటూ కదల నివ్వడం లేదు. ఎన్ని రోజులు సోదాలు జరిపినా సహకరిస్తం. మా లెక్కలు కడిగిన ముత్యంలా ఉంటాయి. మోదీది కొత్త రాజ్యాంగామా? వ్యాపారాలు చేసుకోవద్దా? భూములు కొనడం తప్పా. రూ.150 కోట్ల ట్యాక్స్‌‌‌‌ కట్టాను. రెండు అవార్డులు కూడా అందుకున్నం. సోదాల తర్వాత పూర్తి వివరాలతో మీడియా ముందుకు వస్త’’

- మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్‌‌‌‌