రాంకీ గ్రూప్‌పై ఐటీ రైడ్స్‌.. కీలక డాక్యుమెంట్లు సీజ్

రాంకీ గ్రూప్‌పై ఐటీ రైడ్స్‌.. కీలక డాక్యుమెంట్లు సీజ్

వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్‌పై ఇటీవల ఐటీ దాడులు జరిపింది. ఈ క్రమంలో తనిఖీలు,ఇతర వివరాలతో కూడిన ప్రెస్ నోట్‌ను  ఐటీ శాఖ శుక్రవారం విడుదల  చేసింది. ఈ సోదాల్లో రూ.1200 కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అలాగే దాదాపు రూ.300 కోట్ల లెక్కలు లేని నగదు గుర్తించినట్లు ఐటీ శాఖ చెప్పింది.

 రాంకీ సంస్థ ఉద్దేశపూర్వకంగానే నష్టాలను చూపెట్టిందని ఐటీ శాఖ ఆరోపించింది. రూ.1200 కోట్లు కృత్రిమ నష్టాన్ని చూపిందని తెలిపింది. రాంకీలోని మేజర్ వాటాను సింగపూర్‌కు చెందిన వ్యక్తులకు అమ్మేశారంది. తప్పుడు లెక్కలు చూపించి రూ.300 కోట్లు పన్ను ఎగవేసేందుకు యత్నించినట్లుగా గుర్తించామంది. అంతేకాకుండా రూ.288 కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను నాశనం చేసిందని ఐటీ శాఖ తెలిపింది. రాంకీ దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లతో పాటు వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో ప్రాజెక్ట్ చేపట్టిందని చెప్పింది.