ఇండ్లు కట్టిస్తా అని చెప్పి.. ల‌క్ష రూపాయలే ఇస్తా‌ అంటున్నడు

ఇండ్లు కట్టిస్తా అని చెప్పి..  ల‌క్ష రూపాయలే ఇస్తా‌ అంటున్నడు

వర్షాలతో హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రమంతటా అతులకుతలం అవుతున్న స‌మ‌యంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ దాటి బయటకు రాకపోవడం దురదృష్టకరమ‌ని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ ప్రకటనలకే పరిమితం అయ్యార‌ని, వ‌ర‌ద బాధితుల‌ను పరమర్శించడానికి కూడా ఆయ‌న‌కు ఓపిక లేదని అన్నారు. ఇండ్లు కూలిపోతే ఇండ్లు కట్టిస్తా అని చెప్పి..ఇప్పుడేమో లక్ష రూపాలు ఇస్తాన‌ని మాట మార్చార‌న్నారు.

భారీ వ‌ర్షాలు,వ‌ర‌ద‌లు కార‌ణంగా హైదరాబాద్ లో ఇండ్లు కూలిపోయిన వారంద‌రికీ ఇండ్లు కట్టించాలని జీవ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు. అతివృష్టి తో రైతులు అన్ని పంటలు నష్టపోయారని , కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు పంట నష్టపరిహారం అందడం లేదని అన్నారు.

వర్షాల వ‌ల్ల వరి, పత్తి, మొక్కజొన్న లు రైతులు నష్టపోయారని , పంటల కొనుగోలులో ఎలాంటి ఆంక్షలు పె ట్టకూడదన్నారు. రంగు మరిన ధాన్యాన్ని కూడా కొనాలన్నారు. పంట నష్టపోయిన వారికి ఏకరాకు 20 వేలు నష్టపరిహారం అందించాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి త‌న బాధ్యతను విస్మరిస్తున్నాడ‌ని, రాష్ట్రంలో నెల‌కొన్న ప్ర‌స్తుత పరిస్థితుల‌ను కేంద్రానికి నివేదించడంలో విఫలం అయ్యార‌ని అన్నారు.