ఎలక్షన్స్‌‌‌‌లో సెక్టోరియల్‌‌‌‌ ఆఫీసర్లు కీలకం : పీవో అంకిత్‌‌‌‌

ఎలక్షన్స్‌‌‌‌లో సెక్టోరియల్‌‌‌‌ ఆఫీసర్లు కీలకం : పీవో అంకిత్‌‌‌‌

ములుగు/కాశీబుగ్గ, వెలుగు : ఎలక్షన్లు సజావుగా నిర్వహించడంలో సెక్టోరియల్‌‌‌‌ ఆఫీసర్లు కీలకమని ములుగు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, ఐటీడీఏ పీవో అంకిత్‌‌‌‌, వరంగల్‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి షేక్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ బాషా చెప్పారు. నియోజకవర్గ సెక్టోరియల్‌‌‌‌ ఆఫీసర్లతో బుధవారం ములుగు ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ గెస్ట్‌‌‌‌హౌజ్‌‌‌‌లో, జీడబ్ల్యూఎంసీ హెడ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో వేర్వేరుగా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో సెక్టోరియల్‌‌‌‌ పరిధిలో 6 నుంచి 9 పోలింగ్‌‌‌‌ కేంద్రాలు ఉండే ఛాన్స్‌‌‌‌ ఉందన్నారు.

ఆఫీసర్లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ర్యాంపులు, నీరు, ఫర్నిచర్, విద్యుత్, ఫ్యాన్లు ఉన్నాయో లేవో చూడాలని, ఏవైనా రిపేర్లు చేయాల్సి ఉంటే వెంటనే పూర్తి చేసి సంబంధిత ఫార్మాట్‌‌‌‌లో వివరాలు సమర్పించాలని ఆదేశించారు.ఎన్నికలకు వారం ముందు నుంచి సెక్టోరియల్‌‌‌‌ ఆఫీసర్లు అలర్ట్‌‌‌‌గా ఉండాలని, పోలింగ్‌‌‌‌ సిబ్బందిని తీసుకు వెళ్లడం, తిరిగి తీసుకురావడం, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడడం, పోలింగ్‌‌‌‌ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని సూచించారు.

రిజర్వ్‌‌‌‌ ఈవీఎంలను అందుబాటులో ఉంచుకోవాలని, తహసీల్దార్లు, పోలీస్‌‌‌‌ ఆఫీసర్లతో కో ఆర్డినేట్‌‌‌‌ చేసుకుంటూ ప్రతి పోలింగ్‌‌‌‌ కేంద్రంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ములుగులో తహసీల్దార్‌‌‌‌ విజయభాస్కర్, ఎన్నికల విభాగం డీటీలు విజయకుమార్, అనీస్‌‌‌‌ ఫాతిమా, వరంగల్‌‌‌‌లో ఏసీపీ బోనాల కిషన్‌‌‌‌, తహసీల్దార్లు ఇక్భాల్‌‌‌‌, నాగేశ్వర్‌‌‌‌రావు, సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌‌‌‌, సురేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ పాల్గొన్నారు.