
- 12న గచ్చిబౌలి దగ్గర రన్
హైదరాబాద్, వెలుగు: గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న గచ్చిబౌలి స్టేడియం దగ్గర జరగనున్న గ్లోబ్ గ్రేస్ క్యాన్సర్ రన్ లో ఐటీఐ, ఏటీసీ స్టూడెంట్స్ పాల్గొననున్నారు. మల్లేపల్లి, విజయ్ నగర్ కాలనీ ఐటీఐ, ఏటీసీలో వివిధ కోర్సులు ట్రైనింగ్ తీసుకుంటున్న విద్యార్థులు 1200 మంది పాల్గొననున్నారని విజయ్ నగర్ కాలనీ ఐటీఐ ప్రిన్సిపల్ దోవ శైలజ వెల్లడించారు.
2కే, 5కే, 10 కే రన్ ఉందని, ఈ రన్ లో పాల్గొనే ఐటీఐ స్టూడెంట్లకు ఈ నెల11న మల్లేపల్లి క్యాంపస్ లో వసతి కల్పించి, ఉదయం 5 గంటలకే రన్ జరిగే గచ్చిబౌలి ప్రాంగణానికి బస్సుల ద్వారా తీసుకెళుతున్నామని ఆమె తెలిపారు. ఈ రన్ లో స్టూడెంట్స్ పాల్గొనాలని, ఫౌండేషన్ నిర్వహకులు కార్మిక శాఖకు, అన్ని విద్యా సంస్థలకు లేఖలు రాశారని ఆమె పేర్కొన్నారు.