యూత్‌‌ఫుల్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్ ..ఇట్టు మీ ఎదవ

యూత్‌‌ఫుల్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్ ..ఇట్టు మీ ఎదవ

త్రినాథ్ కటారి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న యూత్‌‌ఫుల్ ఎంటర్‌‌‌‌టైనర్   ‘ఇట్లు మీ ఎదవ’. సాహితీ అవాంచ హీరోయిన్‌‌.  బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌‌, సాంగ్‌‌కు  మంచి రెస్పాన్స్ వచ్చింది.  శుక్రవారం ట్రైలర్‌‌‌‌  లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  ముఖ్యఅతిథిగా హాజరైన  దర్శకుడు తేజ మార్ని  టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. 

  త్రినాథ్ కటారి మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌‌ఫుల్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్.  ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అనే క్యారెక్టర్ చేశా. ఇందులో  తండ్రీ కొడుకులు కథ, తండ్రీ కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ ఈ ముగ్గురు మధ్య  లవ్ స్టోరీ ఉంటుంది.  హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులను ఎంటర్‌‌‌‌టైన్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ‘కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది.  సినిమా చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది. యూత్ వాళ్ళ పేరెంట్స్‌‌ని కూడా తీసుకెళ్లి చూపించే సినిమా ఇది’ అని అన్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నిర్మాత థ్యాంక్స్ చెప్పారు. నటులు గోపరాజు రమణ,  దేవి ప్రసాద్, తాగుబోతు రమేష్​,  డీవోపీ జగదీష్ పాల్గొన్నారు.