పాక్ అనుకూల నినాదాలు చేయడం సిగ్గు చేటు: శివరాజ్ సింగ్ చౌహాన్

పాక్ అనుకూల నినాదాలు చేయడం సిగ్గు చేటు: శివరాజ్ సింగ్ చౌహాన్

రాహుల్ గాంధీ పాదయాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కొందరు నినాదాలు చేయడంపై విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటని అన్నారు. రాహుల్ యాత్రలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయని శివరాజ్ విమర్శించారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణల్ని ఖండించింది.

రాహుల్ గాంధీపై వ్యతిరేకత తెచ్చే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ కుట్ర చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇది ముమ్మాటికి బీజేపీ పనే అంటున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర బుధవారం మధ్యప్రదేశ్ లో అడుగుపెట్టింది. సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు.