ఇంట్లోనే దీక్షకు దిగిన అశ్వత్థామ రెడ్డి

ఇంట్లోనే దీక్షకు దిగిన అశ్వత్థామ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 43 వ రోజు ఆర్టీసీ సమ్మె ఉదృతంగా సాగుతోంది. ఆందోళనలకు దిగిన కార్మికులను ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డిని ఎల్బీనగర్లోని తన ఇంటి వద్ద అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున కార్మికులు చేరుకుంటుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా మాట్లాడిన అశ్వత్థామరెడ్డి.. ఆర్టీసీ విలీనం నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తాను ఇంట్లోనే నిరాహార  దీక్ష కొనసాగిస్తానన్నారు. పోలీసుల తీరు సరిగా లేదని.. తెల్లవారు జామున మూడు గంటల నుంచే తమ ఇంటి తలుపులు కొడుతున్నారని అన్నారు. ఏం చేద్దామన్న పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు. సమ్మె విషయం ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందన్నారు. కార్మికుల పీఎఫ్ సొమ్ము ప్రభుత్వం వాడుకుందన్నారు. కాలం చెల్లిన బస్సులతో కార్మికులు ఏం చేస్తారని ప్రశ్నించారు.  కొత్త బస్సులు కొనాలని అడిగినా వినడం లేదన్నారు. ప్రభుత్వం 3 వేల కోట్ల బాకీ ఉందన్నారు అశ్వత్థామ రెడ్డి. ఈ సమ్మెతో ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.