- విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్‌కు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యలపై విద్యుత్ సంస్థల యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంపై జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మిగిలిన సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులోనూ యాజమాన్యంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నవీన్ మిట్టల్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో జేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు శివాజీ, కో-చైర్మన్ పి.అంజయ్య, కో-కన్వీనర్ నాసర్ షరీఫ్, నాయకులు అక్బర్, మాతంగి శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, పరమేశ్, కొరడాల వెంకటేశ్వర్లు, బి.రవి తదితరులు పాల్గొన్నారు.
