సానుకూల చర్చలపై జేఏసీ హర్షం : జేఏసీ నాయకులు

సానుకూల చర్చలపై జేఏసీ హర్షం : జేఏసీ నాయకులు
  • విద్యుత్​ శాఖ స్పెషల్‌‌ సీఎస్​ నవీన్‌‌ మిట్టల్‌‌కు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు

హైదరాబాద్‌‌, వెలుగు: ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యలపై విద్యుత్​ సంస్థల యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంపై జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన విద్యుత్​ శాఖ స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ నవీన్‌‌ మిట్టల్‌‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మిగిలిన సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులోనూ యాజమాన్యంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు నవీన్‌‌ మిట్టల్‌‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో జేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు శివాజీ, కో-చైర్మన్‌‌ పి.అంజయ్య, కో-కన్వీనర్‌‌ నాసర్‌‌ షరీఫ్‌‌, నాయకులు అక్బర్‌‌, మాతంగి శ్రీనివాస్‌‌, రామకృష్ణారెడ్డి, పరమేశ్‌‌, కొరడాల వెంకటేశ్వర్లు, బి.రవి తదితరులు పాల్గొన్నారు.