పొట్టేలు పోటీలతో జాకీ

పొట్టేలు పోటీలతో జాకీ

యువన్ కృష్ణ, రిదాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాకీ’. డా.ప్రగభల్ దర్శకత్వంలో పీకే7 స్టూడియోస్ బ్యానర్‌‌‌‌పై  ప్రేమ కృష్ణదాస్,  -సి దేవదాస్,  జయ దేవదాస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌‌గా టీజర్‌‌‌‌ను  రిలీజ్ చేశారు. మధురై  బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ  కథ సాగుతుంది. అక్కడి  గ్రామాల్లో జరిగే సంప్రదాయ పొట్టేలు పోటీలు చుట్టూ తిరుగుతుంది.  

గ్రామీణ జీవితం, ప్రజల భావోద్వేగాలు, సంప్రదాయ క్రీడను చూపించిన తీరు ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం నటీనటులు నిజమైన పొట్టేలుతో శిక్షణ తీసుకొని నటించారని, చాలా సహజంగా ఈ పోటీలు ఉంటాయని మేకర్స్ చెప్పారు.  శక్తి బాలాజీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.