
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ జగదాంబిక మహంకాళి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. బోనాలు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 5, 6, 7 పూజల్లో పాల్గొన్న భక్తులు కానుకల రూపంలో రూ.3లక్షల22వేల236 సమర్పించారని ఆలయ ఈఓ శ్రీనివాస్ రాజు, కమిటీ చైర్మన్ అరవింద్ మహేశ్ తెలిపారు. ఇప్పటికే మొదటి లెక్కింపులో రూ.2లక్షల91వేల940, రెండో లెక్కింపులో రూ.3లక్షల91వేల205 సమకూరాయి. మొత్తంగా ఆలయానికి రూ.10లక్షల5వేల381 ఆదాయం వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. వీటితోపాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ సమకూరినట్లు తెలిపారు.