పార్టీ సెక్రటరీ నుంచి..రెండోసారి మంత్రిగా జగదీశ్

పార్టీ సెక్రటరీ నుంచి..రెండోసారి మంత్రిగా జగదీశ్

సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి. 1965 జులై 18న జన్మించారు. తల్లిదండ్రులు చంద్రారెడ్డి, సావిత్రమ్మ. B.A, B. L చదివారు. జగదీశ్ రెడ్డికి భార్య సునీత.. ఒక కుమారుడు, ఒక కూతురు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచారు జగదీశ్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా , అధికార ప్రతినిధిగా, పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గా పనిచేశారు . 2001 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో ఎలక్షన్ ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత …2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జగదీశ్ రెడ్డి. సంవత్సరంపాటు విద్యాశాఖ మంత్రిగా.. మూడున్నరేళ్లు విద్యుత్ , ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సూర్యాపేట నుంచి విజయం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ….ప్రియ శిష్యుడుగా పేరుపొందిన జగదీశ్ రెడ్డి.. రెండోసారి మంత్రివర్గంలో చోటు సంపాదించారు.