జగన్ ఎన్నికల ప్రచారం: 13 జిల్లాల్లో..68 సభలు

జగన్ ఎన్నికల ప్రచారం: 13 జిల్లాల్లో..68 సభలు

YCP అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాల్లో 68 నియోజక వర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. 20 రోజులపాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జగన్ పర్యటించారు. అనంతపురం జిల్లాలో 6 నియోజకవర్గాలు, కర్నూల్ జిల్లాలో 6 నియోజకవర్గాలు, కడప జిల్లాలో 5 నియోజకవర్గాల్లో, చిత్తూరు జిల్లాలో 5 ,నెల్లూరు జిల్లాలో 3 నియోజకవర్గాల్లో YS జగన్ పర్యటించారు. ప్రకాశం జిల్లాలో 5 నియోజకవర్గాలు, గుంటూరు జిల్లాలో 8 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాల్లో పర్యటించి సభలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాలు, తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో, విశాఖ జిల్లాలో 6 నియోజకవర్గాల్లో, విజయనగరం జిల్లాలో 3 నియోజకవర్గాల్లో, శ్రీకాకుళం జిల్లాలో 2 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇడుపులపాయలో నుండి ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని YS జగన్ తిరుపతి లో ముగించారు.