
ప్రమాణస్వీకార ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు ఏపీకి కాబోయే సీఎం జగన్. వీవీఐపీలు, ప్రజలు ప్రమాణస్వీకారోత్సవాన్ని చూసేందుకు చేస్తున్న ఏర్పాట్లను జగన్‌కు వివరించారు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. ఈ నెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ సీఎంగా జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.