మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్(Harish Shankar)లో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్ (Mr.Bachchan).ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లలో జరుగుతోంది.
లేటెస్ట్గా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu) నటిస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.'మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది సార్..మీ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను..మీ ఆన్ సెట్స్ మరియు ఆఫ్ సెట్ వ్యక్తిత్వంతో ఫిదా అయ్యాను అంటూ'డైరెక్టర్ హరీష్ పోస్ట్ చేశారు.
మిస్టర్ బచ్చన్ లో మాస్ మహారాజాని ఏసేయడానికి సిద్ధం..అంటూ జగ్గూభాయ్ పోస్ట్ చేయగా..ఎవరూ ఎవర్నేస్తారో చూసుకుందాం అంటూ రవితేజ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంకా బోస్ కెమెరా బాధ్యతలు చేపట్టారు.రవితేజకి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.చాలా ఫాస్ట్గా సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
నిజానికి రవితేజ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు.మిరపకాయ్ లాంటి సినిమా కావాలంటూ హరీష్ శంకర్ కు సైతం మెసేజెస్ పట్టారు. ఫైనల్ ఇంతకాలానికి వాళ్ళ ఆశలు నెరవేరుతున్నాయి.ఈ సినిమా కూడా మిరపకాయ్ రేంజ్ లో పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుందని సమాచారం.
ఇదిలా ఉంటే..హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు.ఆ కారణంగా ఆయన చేస్తున్న సినిమాల షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. అందులో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. దాంతో రవితేజతో ఈ సినిమాను మొదలుపెట్టేశాడు హరీష్ శంకర్.
#MrBachchan ikkada 😎
— Ravi Teja (@RaviTeja_offl) April 7, 2024
Evaru evarni yestharo chuskundham! https://t.co/KDizNH2PFP