సంగారెడ్డికి భగీరథ నీరు సరఫరా చేయాలి : జగ్గారెడ్డి

సంగారెడ్డికి భగీరథ నీరు సరఫరా చేయాలి : జగ్గారెడ్డి
  • కలెక్టర్ ప్రావీణ్యను కోరిన టీపీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి మున్సిపాలిటీకి సరిపడా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం మున్సిపల్, పబ్లిక్ హెల్త్,  మిషన్ భగీరథ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. 

సంగారెడ్డి న్యూ టౌన్ కు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని జగ్గారెడ్డి అధికారుల దృష్టికి తీసుకురాగా.. మిషన్ భగీరథ అధికారులు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా చేసే 9 పంపుల్లో 7 మాత్రమే నడుస్తున్నాయని త్వరలోనే 8వ పంపు అందుబాటులోకి వస్తే నీటి సమస్య ఉండదని చెప్పారు. 

మిషన్ భగీరథ నీటికి అదనంగా రాజంపేట పంప్ హౌస్ నుంచి వెలుగు ఆఫీస్ పంప్ హౌస్ వరకు గతంలో ఉన్న ఇంటర్ కనెక్టివిటీ లైన్ ను పునరుద్ధరించాలని జగ్గారెడ్డి కోరగా.. లైన్ పునరుద్ధరణకు రూ.40 లక్షలు ఖర్చు అవుతుందని మునిసిపల్ అధికారులు చెప్పారు. ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమీక్షలో కాంగ్రెస్ నాయకులకు సంతోష్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు..