ఫెయిల్ అయిన వారిలో ప్రభుత్వ కాలేజీ విద్యార్ధులే ఎక్కువ

ఫెయిల్ అయిన వారిలో ప్రభుత్వ కాలేజీ విద్యార్ధులే ఎక్కువ

విద్యావ్యవస్థ  విషయంలో  ప్రభుత్వం నిద్రపోతుందని  ఆగ్రహం వ్యక్తం చేశారు పీసీసీ  వర్కింగ్ ప్రెసిడెంట్,  ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇంటర్ బోర్డు  తీరుతో విద్యార్థులు  ఇబ్బందులు పడుతున్నారన్నారు.  4 లక్షల 50 వేల మంది పరీక్ష   రాస్తే.. 2 లక్షల 35 వేల మంది  ఫెయిల్ అయ్యారన్నారు. ఫెయిల్ అయిన  విద్యార్థులంతా  ప్రభుత్వ కాలేజీ  విద్యార్థులేనన్నారు. ఇంటర్నెట్ సౌకర్యం  లేకపోవడంతో  ప్రభుత్వ కాలేజీల్లో   చదివే పిల్లలు ఆన్ లైన  క్లాసులు  వినలేకపోయారన్నారు.  ఇంటర్ బోర్డు  దగ్గర దీక్షకు దిగారు  కాంగ్రెస్ నేతలు. ఫెయిల్ అయిన  విద్యార్థులను ప్రమోట్ చేసి.. ఇంప్రూమెంట్ కు  అవకాశం ఇవ్వాలన్నారు.

మరిన్ని వార్తల కోసం...

 

లిక్కర్ సేల్స్కు జోష్ ఇస్తున్న వింటర్ సీజన్