
జగిత్యాల టౌన్, వెలుగు: ఏజెంట్లు మోసగించడంతో ఆర్థికంగా నష్టపోయిన విద్యార్థిని తీవ్ర మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది. పోలీసుల తెలిపిన ప్రకా రం.. జగిత్యాల అర్బన్ పరిధి హస్నాబాద్ గ్రామానికి చెందిన నల్లమోతు శ్రీనివాస్ కూతురు హర్షిత (25), ఉన్నత చదువులకు అమెరికా వెళ్లేందుకు ఏడాది కిందట హైదరాబాద్ కు చెందిన కొందరు ఏజెంట్లను సంప్రదించి రూ.10 లక్షలు కట్టారు. అమెరికా పంపకపోగా ఏజెంట్లు డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వకపోవడంతో మోసపోయారు.
ఆ తర్వాత జర్మనీ వీసా కోసం ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో వీసాల కోసం భారీగా అప్పులు చేయడంతో ఆర్థికంగా నష్టపోయి తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని ఈనెల 6న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యు లు కరీంనగర్ లోని ప్రతిమ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ సోమవారం హర్షిత మృతి చెందింది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్టు టౌన్ ఎస్ఐ కుమార్ తెలిపారు.